ఏపీ టెన్త్ విద్యార్థులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. పరీక్షల సమయంలో ఫ్రీగా పరీక్షా కేంద్రాలకు ప్రయాణించవచ్చని తెలిపింది. ఏపీలో ఏప్రిల్ 3వ తేదీ నుంచి టెన్త్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలలో విద్యార్థులు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు పరీక్షా కేంద్రాలకు వెళ్లడానికి ఇబ్బందులు పడకుండా శుభవార్త చెప్పింది. పరీక్షల సమయంలో ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణించే అవకాశం కల్పించింది. హాల్ టికెట్ చూపించి ప్రయాణించవచ్చని ప్రకటనలో పేర్కొంది ఆర్టీసీ. పరీక్షలు ప్రారంభమయ్యే 3వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఈ అవకాశం ఉంటుందని ఆర్టీసీ తెలిపింది. ఇంకా పరీక్షల సమయంలో ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది ఆర్టీసీ. ఈ సారి టెన్త్ ఎగ్జామ్స్ కు రాష్ట్రంలో మొత్తం 6.5 లక్షల మంది హాజరుకానున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Exams, JOBS