ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్సియల్ కార్పొరేషన్ (Andhra Pradesh State Financial Corporation)లో పలు పోస్టు భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్(Notification) ద్వారా మేనేజర్లు, అసిస్టెంట్లు మేనేజర్లు, డిప్యూటీ మేనేజర్ల పోస్టులు భర్తీ చేయనున్నారు. అన్ని విభాగాల్లో కలిపి 23 పోస్టులు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టుల దరఖాస్తుకు అక్టోబర్ 10, 2021 వరకు అవకాశం ఉంది. దరఖాస్తు చేయాలనుకొనే అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకోనేందుకు అధికారిక వెబ్ సైట్ https://esfc.ap.gov.in/Careers.jsp ను సందర్శించాలి. ఆన్లైన్(Online) పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఆయా విభాగాల్లో విద్యార్హత(Education Qualification) కలిగి ఉండాలి. ఎంపిక విధానం, దరఖాస్తు విధానం తెలుసుకొనేందకు చదవండి.
అర్హతలు.. ఖాళీల వివరాలు
పోస్టు పేరు | అర్హతలు | ఖాళీల సంఖ్య |
మేనేజర్ (ఫైనాన్స్) | సీఏ/ సీఎంఏ లేదా బీటెక్ చేసి. 60శాతం మార్కులతో ఎంబీఏ / పీజీడీఎం చేసి ఉండాలి. ఫైనాన్స్ సంబంధ రంగంలో మూడేళ్లు అనుభవం ఉండాలి. | 09 |
డిప్యూటీ మేనేజర్ (ఫైనాన్స్) | సీఏ/ సీఎంఏ లేదా బీటెక్ చేసి. 60శాతం మార్కులతో ఎంబీఏ / పీజీడీఎం చేసి ఉండాలి. ఫైనాన్స్(Finance) సంబంధ రంగంలో రెండేళ్ల అనుభవం ఉండాలి. | 03 |
అసిస్టెంట్ మేనేజర్ (ఫైనాన్స్) | గుర్తింపు పొందిన యూనివర్సిటీ(University)లో సీఏ లేదా సీఎంఏ లేదా ఎంబీఏ చేసి ఉండాలి. మెరుగైన కంప్యూటర్ స్కిల్స్(Computer Skills), ఎంఎస్ ఆఫీస్ వచ్చి ఉండాలి. | 05 |
అసిస్టెంట్ మేనేజర్ (లా) | గుర్తింపు పొందిన యూనివర్సిటీలో 60శాతం మార్కులతో లా లో పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసి ఉండాలి. మెరుగైన కంప్యూటర్ స్కిల్స్, ఎంఎస్ ఆఫీస్(MS Office) వచ్చి ఉండాలి. | 06 |
వయో పరిమితి : - ఆగస్టు 1, 2021 వరకు 21 ఏళ్ల నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం..
- ఆన్లైన్ పరీక్ష అనంతరం ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- పరీక్షలో 200 మార్కులు ఉంటాయి. ప్రోఫెషినల్ నాలెడ్జ్, ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, ఫైనాన్షియల్ అవేర్నెస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.
- పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
దరఖాస్తు చేసుకొనే విధానం. .
- కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు.
- దరఖాస్తు చేసుకోవడానికి అఫిసియల్ వెబ్సైట్ https://esfc.ap.gov.in/Careers.jsp ను సందర్శించాలి.
- అందులో నోటిఫికేషన్ను పూర్తిగా చదవాలి. (నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి)
- అనంతరం అప్లే ఆన్లైన్ బటన్పై క్లిక్ చేసి అప్లే చేయాలి.
- దరఖాస్తు చేసుకొన్న అనంతరం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
- జనరల్/బీసీ అభ్యర్థులకు రూ.1003 ఫీజు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.590 ఫీజు చెల్లించాలి.
- దరఖాస్తుచేసుకొనేందుకు ఆఖరు తేదీ అక్టోబర్ 10, 2021 వరకు అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh Government Jobs, CAREER, Government jobs, Govt Jobs 2021, Job notification, JOBS