నిరుద్యోగులకు గుడ్ న్యూస్. హైదరాబాద్‌లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 2021-22 విద్యా సంవత్సరానికి సికింద్రాబాద్ బొల్లారంలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్లో ఖాళీల భర్తీ జరుగుతోంది. మొత్తం 52 ఖాళీలున్నాయి. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT), ప్రైమరీ టీచర్ (PRT) పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఆర్మీ పబ్లిక్ స్కూల్-APS. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను http://www.apsbolarum.edu.in/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. Army Public School, Bolarum, Secunderabad పేరుతో డీడీ తీసి దరఖాస్తు ఫామ్, విద్యార్హతల జిరాక్స్ కాపీ, స్కోర్ కార్డు కాపీలు జత చేసి నోటిఫికేషన్లో తెలిపిన అడ్రస్‌కు పోస్టులో పంపాలి. లేదా స్వయంగా ఇవ్వాలి. దరఖాస్తుల్ని ఇమెయిల్ ద్వారా స్వీకరించరు. కొద్ది రోజుల క్రితమే ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ-AWES ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో ఉద్యోగాలు కోరుకునేవారికి అర్హత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఫలితాలు విడుదలయ్యాయి. దీంతో దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ తమ పాఠశాలల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నాయి. ఇటీవల గోల్కొండలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు సికింద్రాబాద్ బొల్లారంలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్లో టీజీటీ, పీజీటీ, పీఆర్టీ పోస్టుల్ని భర్తీ చేస్తున్నారు.
Railway Jobs: రైల్వే జాబ్ మీ కలా? నైరుతి రైల్వేలో జాబ్స్... దరఖాస్తుకు 3 రోజులే గడువు
RRB NTPC Admit Card 2020: ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అడ్మిట్ కార్డ్స్ వచ్చేశాయి... డౌన్లోడ్ చేయండి ఇలా
APS Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...
మొత్తం ఖాళీలు- 52
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT)- 8 (హిస్టరీ-1, జాగ్రఫీ-1, మ్యాథ్స్-1, కెమిస్ట్రీ-1, సైకాలజీ-1, కంప్యూటర్ సైన్స్-1, ఫిజికల్ ఎడ్యుకేషన్-1)
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT)- 18 (ఇంగ్లీష్-2, హిందీ-2, సంస్కృతం-2, మ్యాథ్స్-2, ఫిజిక్స్-1, కెమిస్ట్రీ-1, బయాలజీ-1, కంప్యూటర్ సైన్స్-2, సోషల్ సైన్స్-4)
ప్రైమరీ టీచర్ (PRT)- 26 (కంప్యూటర్ సైన్స్-2, స్పెషల్ ఎడ్యుకేటర్-2, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్-1, పీఈటీ-1, డ్యాన్స్-1, యోగా-1)
BARC Recruitment 2021: ట్రైనీ పోస్టుల్ని భర్తీ చేస్తున్న బార్క్... మొత్తం 160 ఖాళీలు
Jobs: హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థలో 510 జాబ్స్... దరఖస్తుకు మరో 5 రోజులే గడువు
APS Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
దరఖాస్తు ప్రారంభం- 2020 డిసెంబర్ 24
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 జనవరి 20
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. వివరాలు నోటిఫికేషన్లో తెలుసుకోవచ్చు.
ఇతర అర్హతలు- AWES స్కోర్ కార్డ్‌తో పాటు సీటెట్, టెట్ క్వాలిఫై కావాలి.
దరఖాస్తు ఫీజు- రూ.100
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
Principal, Army Public School Bolarum,
JJ Nagar Post, Secunderabad 500087.