APPSC Group 2 | గ్రూప్ 2 మెయిన్స్ ఫలితాలు విడుదల..

APPSC Group 2 : ఆంధ్రప్రదేశ్ గ్రూప్‌-2 మెయిన్స్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. గత ఏడాది ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు నిర్వహించగా.. మంగళవారం ఫలితాలను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC) విడుదల చేసింది.

news18-telugu
Updated: February 5, 2020, 8:20 AM IST
APPSC Group 2 | గ్రూప్ 2 మెయిన్స్ ఫలితాలు విడుదల..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆంధ్రప్రదేశ్ గ్రూప్‌-2 మెయిన్స్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. గత ఏడాది ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు నిర్వహించగా.. మంగళవారం ఫలితాలను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC) విడుదల చేసింది. ఫలితాలను APPSC తన అధికారిక వెబ్‌సైట్‌‌లో ఉంచింది. మెరిట్ అభ్యర్థులను 1:2 నిష్పత్తిలో ఎంపిక చేసినట్లు ప్రకటనలో పేర్కొంది. 858 మంది ఎంపికైనట్లు వెల్లడించింది. 446 గ్రూప్ 2 పోస్టుల భర్తీ ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయగా.. 2,95,036 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 1,77,876 మంది అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యారు. అందులో 6,195 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించారు. మెయిన్స్‌ ద్వారా ఎంపికైన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని ఆదేశించింది.

ఏపీపీఎస్సీ


ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published by: Shravan Kumar Bommakanti
First published: February 5, 2020, 8:20 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading