హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

APPSC Job Notification: ఏపీలోని నిరుద్యోగులకు అలర్ట్.. APPSC జాబ్ నోటిఫికేషన్ విడుదల..

APPSC Job Notification: ఏపీలోని నిరుద్యోగులకు అలర్ట్.. APPSC జాబ్ నోటిఫికేషన్ విడుదల..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి నోటిపికేషన్ (APPSC Job Notification) విడుదల చేసింది. ఫారెస్ట్ సర్వీస్ విభాగంలో అసిస్టెంట్ కన్జర్వేటర్ల పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.

ఇంకా చదవండి ...

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ఫారెస్ట్ సర్వీస్ విభాగంలో అసిస్టెంట్ కన్జర్వేటర్ల పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 09 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ రేపటి నుంచి అంటే ఏప్రిల్ 20 నుంచి ప్రారంభం అవుతుంది. దరఖాస్తు చేసుకోవడానికి మే 10ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు.

విద్యార్హతల వివరాలు..

అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ విద్యార్హత పొంది ఉండాలి. అయితే అగ్రికల్చర్, బోటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్స్/కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫారెస్ట్రీ, Geology-భూగర్భ శాస్త్రం , హార్టికల్చర్, మాథ్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, వెటర్నరీ సైన్స్, జువాలజ సబ్జెక్టుల్లో డిగ్రీ చేసి ఉండాలి. ఇంకా అభ్యర్థులు నిర్దేశించిన శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. ఆ వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.

Job Mela: గుంటూరు నాగార్జున యూనివర్సిటిలో జాబ్ మేళా.. అప్లికేష‌న్ ప్రాసెస్‌

వయస్సు: అభ్యర్థుల వయస్సు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, EWS అభ్యర్థులకు ఐదేళ్లు, Ex-Service Men, NCC అభ్యర్థులకు మూడేళ్లు వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు.

Civils Coaching: సివిల్స్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. వారికి 31 సెంటర్లలో ఫ్రీ కోచింగ్.. వివరాలిలా..

అప్లికేషన్ ఫీజు: అభ్యర్థులు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజుగా రూ.250 చెల్లించాల్సి ఉంటుంది. ఎగ్జామ్ ఫీజుగా రూ.120 చెల్లించాల్సి ఉంటుంది. అయితే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు ఎగ్జామ్ ఫీజులో మినహాయింపు ఇచ్చారు. వైట్ రేషన్ కార్డు కలిగిన అభ్యర్థులకు సైతం ఫీజులో మినహాయింపు ఇచ్చారు. అభ్యర్థులు నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు ద్వారా ఫీజులు చెల్లించొచ్చు.

ఎంపిక ఎలా:

-అభ్యర్థులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు తొలుత ఇంగ్లిష్, తెలుగు యాబై మార్కుల చొప్పున నిర్వహించే ఎగ్జామ్ లో క్వాలిఫై కావాల్సి ఉంటుంది.

-జనరల్ స్టడీస్&మెంటల్ ఎబిలిటీ 150 మార్కులు, మాథ్స్(SSS Standard) -150, జనరల్ ఫారెస్ట్రీ-1లో 150 మార్కులు, జనరల్ ఫారెస్ట్రీ-2కు సంబంధించి 150 మార్కులు.. మొత్తం 600 మార్కులకు నిర్వహించే ఎగ్జామ్ లో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది.

First published:

Tags: Andhra Pradesh Government Jobs, APPSC, JOBS

ఉత్తమ కథలు