ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ఏపీ ప్రభుత్వానికి చెందిన మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ సబార్డినేట్ సర్వీస్ విభాగంలో ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ ద్వారా ఈ పోస్టులకు ఎంపిక చేయనుంది ఏపీపీఎస్సీ. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 18, 2021 నుంచి ప్రారంభమై డిసెంబర్ 8, 2021 వరకు కొనసాగునుంది. రాత పరీక్షల తేదీలను ఏపీపీఎస్సీ తర్వాత ప్రకటిస్తుంది. అభ్యర్థులు దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి.
పోస్టుల వివరాలు.. అర్హతలు
పోస్టు పేరు | ఖాళీలు | అర్హతలు | జీతం | దరఖాస్తు తేదీలు |
ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (EXTENSION OFFICER ) | 22 | సంబంధిత రంగంలో బ్యాచ్లర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. మహిళలకు మాత్రమే అవకాశం. | రూ.24,400 నుంచి రూ.71,510 | ప్రారంభం - 18/11/2021toముగింపు - 08/12/2021 |
ఎంపిక విధానం- కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్
IIT Delhi : ఐఐటీ ఢిల్లీలో ఎనర్జీ ఇంజనీరింగ్ కోర్సు.. జేఈఈ స్కోర్ ఆధారంగా అడ్మిషన్
పరీక్షా విధానం..
సబ్జెక్టు | ప్రశ్నలు | నిమిషాలు | మార్కులు |
జనర్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ | 150 | 150 | 150 |
కామన్ పేపర్ హోం సైన్స్, సోషల్ వర్క్ | 150 | 150 | 150 |
అప్లై చేయండి ఇలా
Step 1- అభ్యర్థులు ముందుగా https://psc.ap.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
Step 2- హోమ్ పేజీలో One Time Profile Registration పైన క్లిక్ చేయాలి.
NEET 2021: త్వరలో నీట్ కౌన్సెలింగ్.. దేశంలోని టాప్ మెడికల్ కాలేజీలు ఇవే..
Step 3- ఆ తర్వాత New Registration పైన క్లిక్ చేయాలి.
Step 4- అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతల వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.
Step 5- యూజర్ ఐడీ జనరేట్ అవుతుంది.
Step 6- ఆ తర్వాత లాగిన్ అయి పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి.
Step 7- ఆ తర్వాత https://psc.ap.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేసి Online Application Submission పైన క్లిక్ చేయాలి.
Step 8- యూజర్ ఐడీ, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ చేయాలి.
Step 9- పోస్టు పేరు సెలెక్ట్ చేసి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.
Step 10- అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని భద్రపర్చుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: APPSC, Govt Jobs 2021, Job notification, JOBS