ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ (APPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ సారి ఆయుష్ విభాగంలో ఖాళీలను భర్తీ చేస్తున్నట్టు నోటిఫికేషన్లో ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఆయుష్ (Ayush) విభాగంలో ఆయుర్వేదం, యూనాని, హోమియో విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అన్ని శాఖల్లోనూ మెడికల్ ఆఫీసర్ (Medical Officer) పోస్టులను ఈ నోటిఫికేషన్ (Notification) ద్వారా భర్తీ చేయనున్నారు. మరోవైపు అగ్రవర్ణ పేదలకు (ఈడబ్ల్యూఎస్) ప్రభుత్వ ఉద్యోగాల్లో పది శాతం కోటా అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టుల దరఖాస్తుకు గరిష్ట వయోపరిమితి 42 ఏళ్లుగా నిర్ణయించారు. అక్టోబర్ 4, 2021 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ పోస్టులకు రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పరీక్ష విధానం, దరఖాస్తు ప్రక్రియకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్ https://psc.ap.gov.in/ ను సందర్శించాలి.
అర్హతలు.. ఎంపిక విధానం
- ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలను కోనే వారు ఆయుర్వేదం, యునానీ, హోమియోలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. సంవత్సరం పాటు ఇంటర్న్షిప్ చేయడంతోపాటు దరఖాస్తు చేస్తున్న విభాగంలో మెడికల్ ప్రాక్టీస్నర్గా రిజిస్టర్ అయి ఉండాలి.
- దరఖాస్తు చేసుకోవాలనుకొనే అభ్యర్థుల వయసు 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
- అభ్యర్థిని రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
- రాత పరీక్షలో మెరిట్ వచ్చిన వారికి పోస్టింగ్ ఉంటుంది.
Step 3: మీరు గతంలో ఏపీపీఎస్సీ వెబ్సైట్ రిజిస్టర్ అయి ఉంటే లాగిన్ అయి పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలి.
Step 4: మొదటి సారి మీరు ఏపీపీఎస్సీ పరీక్ష రాస్తే మీరు రిజిస్టర్ ఐడీ కోసం Login ఆప్షన్ లోకి వెళ్లి New User అని క్లిక్ చేసి మీ సమాచారం అంతా నమోదు చేయాలి.
Step 5: అప్పుడు మీకు యూజర్ ఐడీ, పాస్ వర్డ్ ఏర్పడతాయి.
Step 6: వాటి ద్వారా మీరు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Step 7: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 25, 2021 వరకు అవకాశం ఉంది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.