ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) పలు పోస్టుల నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ విభాగాల్లో ఇంజనీరింగ్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ (Notification) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సివిల్ (Civil), ఈఎన్‌వీ, మెకానికల్ (Mechanical) విభాగాల్లో 190 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఆన్లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 11, 2021 వరకు అవకాశం ఉంది. దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల గరిష్ట వయసు 42 ఏళ్లు మించకూడదు. రిజర్వేషన్ ప్రకారం సడలింపులు ఉంటాయి. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ (Online) విధానంలోనే ఉంటుంది. అభ్యర్థులను కంప్యూటర్ బేస్డ్ పరీక్ష విధానం ద్వారా ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్ కోసం అధికారిక వెబ్సైట్ https://psc.ap.gov.in/ ను సందర్శించాలి.
ఖాళీల వివరాలు..
పోస్టు కోడ్ | పోస్టు పేరు | ఖాళీలు |
01 | A.P RWS & S ఇంజనీరింగ్‌లో AE (సివిల్)సబ్-ఆర్డినేట్ సర్వీస్ | 92 |
02 | A.P పంచాయితీ రాజ్‌లో AE (సివిల్ / మెకానికల్) మరియుగ్రామీణాభివృద్ధి సబ్-ఆర్డినేట్ సర్వీస్ | 34 |
03 | PH & ME సబ్-ఆర్డినేట్ సర్వీస్‌లో AE (ENV) | 06 |
04 | ఎండోమెంట్లో AE (సివిల్ లేదా మెకానికల్)సబ్-ఆర్డినేట్ సర్వీస్ | 03 |
05 | A.E పబ్లిక్ హెల్త్ & MPL ఇంజనీరింగ్‌లో AE (సివిల్) (PH)సబ్-ఆర్డినేట్ సర్వీస్ | 02 |
06 | A.P పబ్లిక్‌లో మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్)ఆరోగ్యం & MPL ఇంజనీరింగ్ సబ్-ఆర్డినేట్ సర్వీస్ | 02 |
07 | A.P గ్రౌండ్ వాటర్ సబ్-ఆర్డినేట్ సర్వీస్‌లో AE (సివిల్) | 01 |
08 | A.P లో AE (సివిల్) జలవనరుల సబ్-ఆర్డినేట్సేవ | 45 |
09 | A.P నీటి వనరులలో AE (మెకానికల్)సబ్-ఆర్డినేట్ సర్వీస్ | 05 |
అర్హతలు..
పోస్టుకు సంబంధించిన విభాగంలో ఇంజనీరింగ్ చేసి ఉండాలి.
పరీక్ష విధానం..
- పరీక్ష విధానం పూర్తిగా ఆన్లైన్ ద్వారా ఉంటుంది.
- రెండు పేపర్లు ఉంటాయి. మొత్తం మార్కులు 300.
- పేపర్ -1లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, పేపర్-2లో సివిల్, మెకానికల్ సబ్జెక్టులు ఉంటాయి.
- ఎన్విరాన్మెంట్ ఇంజనిరింగ్ పరీక్ష మాత్రం పోస్టు 3కి ఉంటుంది. పరీక్షలో నెగిటీవ్ మార్కింగ్ ఉండదు. పరీక్ష ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది.
సబ్జెక్టు | ప్రశ్నలు | సమయం | మార్కులు |
జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ | 150 | 150 | 150 |
సివిల్, మెకానికల్ | 150 | 150 | 150 |
ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ | 150 | 150 | 150 |
దరఖాస్తు విధానం..
Step 1- అభ్యర్థులు ముందుగా https://psc.ap.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
Step 2- హోమ్ పేజీలో One Time Profile Registration పైన క్లిక్ చేయాలి.
Step 3- ఆ తర్వాత New Registration పైన క్లిక్ చేయాలి.
Step 4- అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతల వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.
Step 5- యూజర్ ఐడీ జనరేట్ అవుతుంది.
Step 6- ఆ తర్వాత లాగిన్ అయి పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి.
Step 7- ఆ తర్వాత https://psc.ap.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేసి Online Application Submission పైన క్లిక్ చేయాలి.
Step 8- యూజర్ ఐడీ, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ చేయాలి.
Step 9- పోస్టు పేరు సెలెక్ట్ చేసి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.
Step 10- అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని భద్రపర్చుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhrapradesh, APPSC, CAREER, Govt Jobs 2021, Job notification, JOBS