Home /News /jobs /

APPSC RELEASED JOB NOTIFICATION FOR DIRECT RECRUITMENT OF VARIOUS GAZETTED POSTS NS

APPSC Jobs 2021: ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త.. గెజిటెడ్ ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. మరో జాబ్ నోటిఫికేషన్(Job Notification) ను విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నుంచి ఇటీవల వరుసగా జాబ్ నోటిఫికేషన్లు (Job Notification) విడుదల అవుతున్నాయి. తాజాగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరో జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. పలు గెజిటెడ్ పోస్టులను(GAZETTED POSTS) భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. మొత్తం 25 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్, సెరీకల్చర్ ఆఫీసర్, అగ్రికల్చర్ ఆఫీసర్, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్, అసిస్టెంట్ కమిషనర్, అసిస్టెంట్ డైరెక్టర్ తదితర పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు(Jobs) దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 08న ప్రారంభం కానుంది. దరఖాస్తుకు డిసెంబర్ 28ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై (APPSC Job Application) చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.

    పోస్టులు, ఖాళీల వివరాలు..
















































    S.No.పోస్టుఖాళీలు
    1.ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్(AP Fisheries Service)11
    2., సెరీకల్చర్ ఆఫీసర్ (AP Sericulture Service)01
    3.అగ్రికల్చర్ ఆఫీసర్(AP Agriculture Service)06
    4.డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్(AP Works Account Service)02
    5.టెక్నికల్ అసిస్టెంట్(AP Police Service)01
    6.అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్,03
    7.అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్(AP Horticulture Service)01
    మొత్తం25

    విద్యార్హతల వివరాలు..
    ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్(AP Fisheries Service):
    ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు బ్యాచలర్ ఆఫ్ ఫిషరీష్ సైన్స్(B.F.Sc) విద్యార్హతను గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పొంది ఉండాలి.
    సెరీకల్చర్ ఆఫీసర్ (AP Sericulture Service): ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు అగ్రికల్చర్ లో బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి. లేదా సైన్స్ లో మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి. బాటనీ/జువాలజీని సబ్జెక్టుగా కలిగి ఉండాలి.
    అగ్రికల్చర్ ఆఫీసర్: అగ్రికల్చర్ లో బ్యాచిలర్ డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ విభాగంలోని ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
    డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
    AP Govt Jobs: నిరుద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త.. ఆ ప్రభుత్వ విభాగంలో 4,142 ఉద్యోగాలు.. వివరాలివే

    టెక్నికల్ అసిస్టెంట్: ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
    అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్: లాలో గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి, హైకోర్టు అడ్వకేట్ గా మూడేళ్ల పాటు ప్రాక్టీస్ చేసి ఉండాలి. అభ్యర్థి తప్పనిసరిగా హిందువు అయి ఉండాలి.
    అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్: అభ్యర్థులు నాలుగేళ్ల బీఎస్సీ(హార్టికల్చర్) డిగ్రీతో పాటు ఎమ్మెస్సీ హార్టికల్చర్ చేసి ఉండాలి. ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
    Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు

    వయో పరిమితి: టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులకు 21-28 ఏళ్లు, అసిస్టెంట్ కమిషనర్ పోస్టులకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులకు 28-42 ఏళ్లు, ఇతర పోస్టులకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థుల వయస్సు 18-42 ఏళ్లు ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు పదేళ్లు, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల పాటు వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు.
    AP Jobs: ఏపీలో టెన్త్, ఇంటర్, ఐటీఐ అర్హతతో ఉద్యోగాలు.. రిజిస్ట్రేషన్ కు మరో మూడు రోజులే ఛాన్స్.. ఇలా రిజిస్టర్ చేసుకోండి

    దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ. 250, ఎగ్జామ్ ఫీజు కింద రూ. 120 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్, వైట్ రేషన్ కార్డుదారులకు ఎగ్జామ్ ఫీజు చెల్లింపులో మినహాయింపు ఇచ్చారు.

    ఎలా అప్లై చేయాలంటే..
    ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 8వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది.
    -దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయిన అనంతరం అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://psc.ap.gov.in/ నుంచి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Andhra Pradesh Government Jobs, APPSC, Govt Jobs 2021, Job notification, JOBS, State Government Jobs

    తదుపరి వార్తలు