APPSC Job Notification: ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం (AP Government) గుడ్ న్యూస్ చెప్పింది. రెవెన్యూ, దేవదాయశాఖల్లో ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్‌సీ (APPSC) తాజాగా ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో రెవెన్యూ శాఖలో (Revenue Department) 670 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Notification) ఇచ్చింది ఏపీపీఎస్‌సీ.. అందులో ప్రధానంగా దేవదాయ శాఖలో (Endowment Department) 60 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 730 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 30, 2021న ప్రారంభమై జనవరి 19, 2022 వరకు కొనసాగుతుంది. అప్లికేషన్ ప్రాసెస్, దరఖాస్తు విధానానికి అధికారిక వెబ్‌సైట్ https://psc.ap.gov.in/ ను సందర్శించాల్సి ఉంటుంది.
పోస్టుల వివరాలు రెవెన్యూ శాఖలో..
జిల్లా | పోస్టుల సంఖ్య |
శ్రీకాకుళం | 38 |
విజయనగరం | 34 |
విశాఖపట్నం | 43 |
తూర్పు గోదావరి | 64 |
పశ్చిమ గోదావరి | 48 |
కృష్ణ | 50 |
గుంటూరు | 57 |
ప్రకాశం | 56 |
SPS నెల్లూరు | 46 |
చిత్తూరు | 66 |
అనంతపురము | 63 |
కర్నూలు | 54 |
వైఎస్ఆర్ కడప | 51 |
మొత్తం | 670 |
అర్హతలు
దరఖాస్తు చేసుకొనే అభ్యర్థి గుర్తింపు పొందన యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. కంప్యూటర్ పరీజ్ఞానం ఉండాలి.
Jobs in IPR: ఐపీఆర్‌లో అసిస్టెంట్ ఉద్యోగాలు.. జీతం రూ.20,000.. అప్లికేషన్ ప్రాసెస్
దేవదాయ శాఖలో జిల్లా వారీగా ఉద్యోగాలు
జిల్లా | పోస్టుల సంఖ్య |
శ్రీకాకుళం | 04 |
విజయనగరం | 04 |
విశాఖపట్నం | 04 |
తూర్పు గోదావరి | 08 |
పశ్చిమ గోదావరి | 07 |
కృష్ణ | 06 |
గుంటూరు | 07 |
ప్రకాశం | 06 |
SPS నెల్లూరు | 04 |
చిత్తూరు | 01 |
అనంతపురము | 02 |
కర్నూలు | 06 |
వైఎస్ఆర్ కడప | 01 |
మొత్తం | 60 |
అర్హతలు
దరఖాస్తు చేసుకొనే అభ్యర్థి గుర్తింపు పొందన యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
ఎంపిక విధానం..
- దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థులకు స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ ఎగ్జామ్ నిర్వహిస్తారు.
- సంబంధిత పోస్టుల ఆధారంగా కంప్యూటర్ ప్రొఫిషియన్సీని పరీక్షిస్తారు.
RRB Group D Exam: రైల్వే గ్రూప్-డీ ప్రిపేర్ అవుతున్నారా.. సెలబస్ అండ్ స్టడీ ప్లాన్ వివరాలు!
దరఖాస్తు విధానం..
Step 1 : అభ్యర్థులు ముందుగా ఏపీపీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ https://psc.ap.gov.in/ ఓపెన్ చేయాలి.
Step 2 : హోమ్ పేజీలో వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కోసం One Time Profile Registration లింక్ పైన క్లిక్ చేయాలి.
Step 3 : ఆ తర్వాత New Registration పైన క్లిక్ చేయాలి.
Step 4 : అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతల వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.
Step 5 : యూజర్ ఐడీ జనరేట్ అవుతుంది.
Step 6 : ఆ తర్వాత లాగిన్ అయి పాస్‌వర్డ్ సెట్ చేసుకోవాలి.
Step 7 : ఆ తర్వాత https://psc.ap.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేసి Online Application Submission పైన క్లిక్ చేయాలి.
Step 8: యూజర్ ఐడీ, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ చేయాలి.
Step 9 : పోస్టు పేరు సెలెక్ట్ చేసి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.
Step 10 : అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసుకొని భద్రపర్చుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, APPSC, Govt Jobs 2021, Job notification, JOBS