APPSC Notification 2021: నిరుద్యోగులకు అలర్ట్... 54 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్‌సీ నోటిఫికేషన్

APPSC Notification 2021: నిరుద్యోగులకు అలర్ట్... 54 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్‌సీ నోటిఫికేషన్ (appsc logo)

APPSC Recruitment 2021 | ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. వేర్వేరు విభాగాల్లో ఖాళీల భర్తీకి ఏపీపీఎస్‌సీ (APPSC) వేర్వేరు నోటిఫికేషన్స్ విడుదల చేసింది. ఖాళీలు, విద్యార్హతల వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఖాళీల భర్తీకి వరుసగా జాబ్ నోటిఫికేషన్స్ విడుదల చేస్తోంది. ఆయుష్ డిపార్ట్‌మెంట్‌లో ఆయుర్వేద, హోమియోపతి, యునానీ విభాగాల్లో 151 మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో మరిన్ని పోస్టుల భర్తీకి వేర్వేరు నోటిఫికేషన్స్ విడుదల చేసింది ఏపీపీఎస్‌సీ. ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ విభాగంలో డీపీఆర్‌వో, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సర్వీస్‌లో అసిస్టెంట్ డైరెక్టర్, లెజిస్లేచర్ సర్వీస్‌లో తెలుగు రిపోర్టర్, హార్టికల్చర్ సర్వీస్‌లో హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి వేర్వేరు నోటిఫికేషన్స్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రారంభం, దరఖాస్తు చివరి తేదీ వేర్వేరుగా ఉన్న విషయాన్ని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. ఖాళీల వివరాలు, విద్యార్హతలు, ఇతర వివరాలు తెలుసుకోండి.

    APPSC Recruitment 2021: ఖాళీలు, విద్యార్హతల వివరాలివే...








































    పోస్టు పేరు ఖాళీల సంఖ్య విద్యార్హతలు దరఖాస్తు ప్రారంభం దరఖాస్తుకు చివరి తేదీ
    డీపీఆర్‌ఓ 4 ఏదైనా డిగ్రీతో పాటు జర్నలిజంలో మాస్టర్స్ డిగ్రీ 2021 అక్టోబర్ 19 2021 నవంబర్ 11
    అసిస్టెంట్ డైరెక్టర్ 6 సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌లో బీఈ లేదా బీటెక్ లేదా తత్సమాన అర్హత 2021 అక్టోబర్ 22 2021 నవంబర్ 12
    తెలుగు రిపోర్టర్ 5 డిగ్రీతో పాటు షార్ట్ హ్యాండ్, తెలుగు టైప్ రైటింగ్‌లో హయ్యర్ గ్రేడ్ 2021 అక్టోబర్ 18 2021 నవంబర్ 8
    హార్టికల్చర్ ఆఫీసర్ 39 హార్టికల్చర్ సబ్జెక్ట్‌తో బీఎస్సీ లేదా బీఎస్సీ హానర్స్ 2021 అక్టోబర్ 11 2021 నవంబర్ 2

    ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ విభాగంలో 4 డీపీఆర్‌ఓ పోస్టులున్నాయి. ఏదైనా డిగ్రీతో పాటు జర్నలిజంలో మాస్టర్స్ డిగ్రీ పాస్ అయినవారు అప్లై చేయొచ్చు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 42 ఏళ్లు ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. డీపీఆర్‌ఓ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    ఆంద్రప్రదేశ్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సర్వీస్‌లో 6 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులున్నాయి. సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌లో బీఈ లేదా బీటెక్ పాస్ అయినవారు అప్లై చేయాలి. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 42 ఏళ్లు ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. అసిస్టెంట్ డైరెక్టర్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    ఆంధ్రప్రదేశ్ లెజిస్లేచర్ సర్వీస్‌లో 5 తెలుగు రిపోర్టర్ పోస్టులున్నాయి. ఏదైనా డిగ్రీ పాస్ కావాలి. షార్ట్ హ్యాండ్, తెలుగు టైప్ రైటింగ్‌లో హయ్యర్ గ్రేడ్ పాస్ కావాలి. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 42 ఏళ్లు ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. తెలుగు రిపోర్టర్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    ఆంధ్రప్రదేశ్ హార్టికల్చర్ సర్వీస్‌లో 39 హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులున్నాయి. హార్టికల్చర్ సబ్జెక్ట్‌తో బీఎస్సీ లేదా బీఎస్సీ హానర్స్ పాస్ కావాలి. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 42 ఏళ్లు ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. హార్టికల్చర్ ఆఫీసర్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    APPSC Recruitment 2021: అప్లై చేయండి ఇలా


    Step 1- అభ్యర్థులు ముందుగా https://psc.ap.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

    Step 2- హోమ్ పేజీలో One Time Profile Registration పైన క్లిక్ చేయాలి.

    Step 3- ఆ తర్వాత New Registration పైన క్లిక్ చేయాలి.

    Step 4- అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతల వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.

    Step 5- యూజర్ ఐడీ జనరేట్ అవుతుంది.

    Step 6- ఆ తర్వాత లాగిన్ అయి పాస్‌వర్డ్ సెట్ చేసుకోవాలి.

    Step 7- ఆ తర్వాత https://psc.ap.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేసి Online Application Submission పైన క్లిక్ చేయాలి.

    Step 8- యూజర్ ఐడీ, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ చేయాలి.

    Step 9- పోస్టు పేరు సెలెక్ట్ చేసి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.

    Step 10- అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసుకొని భద్రపర్చుకోవాలి.
    Published by:Santhosh Kumar S
    First published: