ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఇటీవల ఉద్యోగాల భర్తీకి వరుసగా జాబ్ నోటిఫికేషన్స్ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయుష్ డిపార్ట్మెంట్లో ఆయుర్వేద, హోమియోపతి, యునానీ విభాగాల్లో 151 మెడికల్ ఆఫీసర్ (Medical Officer) పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. ఈ నోటిఫికేషన్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఇక తాజాగా హార్టికల్చర్ సర్వీస్‌లో హార్టికల్చర్ ఆఫీసర్ (Horticulture Officer) పోస్టుల భర్తీకి అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభించింది ఏపీపీఎస్సీ. ఈ నోటిఫికేషన్ ద్వారా 39 ఖాళీలను భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు 2021 నవంబర్ 2 లోగా దరఖాస్తు చేయాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన ఇతర వివరాలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.
మొత్తం ఖాళీలు | 39 |
జోన్ I (శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు) | 5 |
జోన్ II (తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలు) | 13 |
జోన్ III (గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు) | 11 |
జోన్ IV (చిత్తూరు, కడప, అనంతపూర్, కర్నూలు జిల్లాలు) | 10 |
Railway Jobs: రైల్వేలో 2226 ఉద్యోగాలు... టెన్త్‌తో పాటు ఆ అర్హత ఉంటే చాలు
దరఖాస్తు ప్రారంభం- 2021 అక్టోబర్ 11
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 నవంబర్ 2
విద్యార్హతలు- రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన యూనివర్సిటీ లేదా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ICAR) గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి హార్టికల్చర్ సబ్జెక్ట్‌తో నాలుగేళ్ల బీఎస్సీ లేదా బీఎస్సీ హానర్స్ పాస్ కావాలి.
వయస్సు- 2021 జూలై 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 42 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు- రూ.250 అప్లికేషన్ ఫీజు, రూ.120 ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ రూ.120 ఎగ్జామినేషన్ ఫీజు చెల్లిస్తే చాలు.
ఎంపిక విధానం- కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
వేతనం- రూ.35,120 బేసిక్ వేతనంతో మొత్తం రూ.87,130 వేతనం లభిస్తుంది.
ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
SBI PO Notification 2021: ఎస్బీఐలో 2,056 ఉద్యోగాలు... డిగ్రీ చదువుతున్నవారికీ ఛాన్స్
Step 1- అభ్యర్థులు ముందుగా https://psc.ap.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
Step 2- హోమ్ పేజీలో One Time Profile Registration పైన క్లిక్ చేయాలి.
Step 3- ఆ తర్వాత New Registration పైన క్లిక్ చేయాలి.
Step 4- అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతల వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.
యూజర్ ఐడీ జనరేట్ అవుతుంది.
Step 5- ఆ తర్వాత లాగిన్ అయి పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి.
Step 6- ఆ తర్వాత https://psc.ap.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేసి వన్‌టైమ్ ప్రొఫైల్
Step 7- రిజిస్ట్రేషన్ నెంబర్‌తో లాగిన్ కావాలి.
Step 8- Online Application Submission పైన క్లిక్ చేయాలి.
Step 9- యూజర్ ఐడీ, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ చేయాలి.
Step 10- పోస్టు పేరు సెలెక్ట్ చేసి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.
Step 11- అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని భద్రపర్చుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Andhra Pradesh Government Jobs, Andhra pradesh news, AP News, CAREER, Govt Jobs 2021, Job notification, JOBS, Telugu news, Telugu varthalu