హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

APPSC Recruitment 2021: నిరుద్యోగులకు అలర్ట్... 93,780 వరకు వేతనంతో ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాలు

APPSC Recruitment 2021: నిరుద్యోగులకు అలర్ట్... 93,780 వరకు వేతనంతో ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాలు

నిరుద్యోగులకు శుభవార్త

నిరుద్యోగులకు శుభవార్త

APPSC Recruitment 2021 | ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) మరో జాబ్ నోటిఫికేషన్ ద్వారా గెజిటెడ్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఖాళీలు, విద్యార్హతలు, ఇతర వివరాలు తెలుసుకోండి.

  ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు అలర్ట్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) మరిన్ని ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ (Job Notification) ద్వారా 25 గెజిటెడ్ పోస్టుల్ని ఏపీపీఎస్‌సీ భర్తీ చేస్తోంది. ఇప్పటికే పలు నోటిఫికేషన్స్ ద్వారా నాన్ గెజిటెడ్ పోస్టుల్ని భర్తీ చేసిన సంగతి తెలిసిందే. లేటెస్ట్ నోటిఫికేషన్ ద్వారా ఫిషరీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, సెరీకల్చర్ ఆఫీసర్, అగ్రికల్చర్ ఆఫీసర్, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్, అసిస్టెంట్ కమిషనర్, అసిస్టెంట్ డైరెక్టర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 డిసెంబర్ 28 చివరి తేదీ. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు, విద్యార్హతలు, ఖాళీల సంఖ్య తెలుసుకోండి.

  APPSC Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...


  మొత్తం ఖాళీలు25విద్యార్హతలువయస్సువేతనం
  ఫిషరీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (ఏఫీ ఫిషరీస్ సర్వీస్)11బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్18 నుంచి 42 ఏళ్లురూ.29,760 బేసిక్ వేతనంతో మొత్తం రూ.80,930
  సెరీకల్చర్ ఆఫీసర్ (సెరీకల్చర్ సర్వీస్)1సెరీకల్చర్, బాటనీ, జువాలజీ సబ్జెక్ట్‌లో మాస్టర్స్ డిగ్రీ సెకండ్ ప్లాస్ కావాలి. బ్యాచిలర్స్ డిగ్రీలో అగ్రికల్చర్18 నుంచి 42 ఏళ్లురూ.35,120 బేసిక్ వేతనంతో మొత్తం రూ.87,130
  అగ్రికల్చర్ ఆఫీసర్ (అగ్రికల్చర్ సర్వీస్)6బ్యాచిలర్స్ ఆఫ్ సైన్స్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్18 నుంచి 42 ఏళ్లురూ.35,120 బేసిక్ వేతనంతో మొత్తం రూ.87,130
  డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (ఏపీ వర్క్స్ అకౌంట్స్ సర్వీస్)2బ్యాచిలర్స్ డిగ్రీ18 నుంచి 42 ఏళ్లురూ.29,760 బేసిక్ వేతనంతో మొత్తం రూ.80,930
  టెక్నికల్ అసిస్టెంట్ (ఏపీ పోలీస్ సర్వీస్)1బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్21 నుంచి 28 ఏళ్లురూ.40,270 బేసిక్ వేతనంతో మొత్తం రూ.93,780
  అసిస్టెంట్ కమిషనర్ (ఏపీ ఎండోమెంట్స్ సర్వీస్)3న్యాయ శాస్త్రంలో డిగ్రీ28 నుంచి 42 ఏళ్లురూ.31,460 బేసిక్ వేతనంతో మొత్తం రూ.84,970
  అసిస్టెంట్ డైరెక్టర్ (ఏపీ హార్టీకల్చర్ సర్వీస్)1ఎంఎస్‌సీ హార్టీకల్చర్18 నుంచి 42 ఏళ్లురూ.40,270 బేసిక్ వేతనంతో మొత్తం రూ.93,780


  ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

  SBI CBO Recruitment 2021: రూ.63,840 వేతనంతో ఎస్‌బీఐలో 1,226 జాబ్స్... అప్లై చేయండి ఇలా

  APPSC Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


  దరఖాస్తు ప్రారంభం- 2021 డిసెంబర్ 8

  దరఖాస్తుకు చివరి తేదీ- 2021 డిసెంబర్ 28

  విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.

  వయస్సు- వయస్సు వేర్వేరు పోస్టులకు వేర్వేరు విధంగా ఉంది. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.

  దరఖాస్తు ఫీజు- అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు రూ.250, ఎగ్జామినేషన్ ఫీజ్ రూ.120 చెల్లించాలి. ఎస్‌సీ, ఎస్టీ, దివ్యాంగులు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ ఫీజు రూ.120 చెల్లించాలి.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Andhra Pradesh, Andhra Pradesh Government Jobs, Andhra pradesh news, AP News, APPSC, CAREER, Govt Jobs 2021, Job notification, JOBS, State Government Jobs, Telugu news, Telugu varthalu

  ఉత్తమ కథలు