APPSC Recruitment 2021 | ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారికి అలర్ట్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా ఉద్యోగాల భర్తీకి వరుసగా జాబ్ నోటిఫికేషన్స్ (Job Notifications) విడుదల చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) పలు నోటిఫికేషన్ల ద్వారా భారీగా ఖాళీలను భర్తీ చేస్తోంది. పలు విభాగాల్లో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి అక్టోబర్ 21న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది ఏపీపీఎస్‌సీ. ఆసక్తి గల అభ్యర్థులు 2021 నవంబర్ 11 లోగా దరఖాస్తు చేయాలి. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 190 ఖాళీలను భర్తీ చేస్తోంది. వీటిలో క్యారీ ఫార్వర్డ్ ఖాళీలు 40 ఉండగా, తాజా ఖాళీలు 150 ఉన్నాయి. ఖాళీల వివరాలు, విద్యార్హతల గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఈ పోస్టులకు ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి.
వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. సంబంధిత బ్రాంచ్‌లో బ్యాచిలర్స్ ఆఫ్ ఇంజనీరింగ్ లేదా బ్యాచిలర్స్ ఆఫ్ టెక్నాలజీ లేదా సంబంధిత బ్రాంచ్‌లో డిప్లొమా పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేయొచ్చు. అభ్యర్థుల వయస్సు 2021 జూలై 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 42 ఏళ్లు ఉండాలి. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది. ఈ పోస్టులకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేయనుంది ఏపీపీఎస్‌సీ. ఎంపికైనవారికి రూ.31,460 బేసిక్ వేతనంతో మొత్తం రూ.84,970 వేతనం లభిస్తుంది.
ఇక వేర్వేరు పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. 4 డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ పోస్టులకు, 39 హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులకు, 5 తెలుగు రిపోర్టర్ పోస్టులకు దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది ఏపీపీఎస్‌సీ. మరోవైపు 6 అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, 29 అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్, 1 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, 2 హాస్టల్ వెల్‌ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 పోస్టులకు నవంబర్ 12న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఏపీపీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ https://psc.ap.gov.in/ ఫాలో కావాలి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.