APPSC Recruitment 2021: బీటెక్ అర్హతతో ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు

APPSC Recruitment 2021: బీటెక్ అర్హతతో ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు (APPSC Logo)

APPSC Recruitment 2021 | ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. అప్లై చేయడానికి మరో 2 రోజులే గడువుంది. జాబ్ నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    బీటెక్ లేదా బ్యాచిలర్స్ ఆఫ్ ఇంజనీరింగ్ కోర్సు పాస్ అయినవారికి అలర్ట్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సర్వీస్‌లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. ఈ జాబ్ నోటిఫికేషన్‌ను (Job Notification) కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) విడుదల చేసింది. సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సర్వీస్‌లో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల్ని ప్రకటించింది. మొత్తం 6 ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. అప్లై చేయడానికి 2021 నవంబర్ 12 చివరి తేదీ. ఈ పోస్టులకు దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హత వివరాలు తెలుసుకోవాలి.

    వీటితో పాటు 4 డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ పోస్టులకు, 151 మెడికల్ ఆఫీసర్ పోస్టులకు, 39 హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులకు, 5 తెలుగు రిపోర్టర్ పోస్టులకు, 35 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా 6 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభమైంది. మరి ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.

    DRDO Recruitment 2021: డీఆర్‌డీఓలో 106 ఉద్యోగాలు... ఆ అర్హతలు ఉంటే చాలు

    APPSC Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...





















    భర్తీ చేసే పోస్టు అసిస్టెంట్ డైరెక్టర్
    ఖాళీల వివరాలు 6
    దరఖాస్తు ప్రారంభం 2021 అక్టోబర్ 22
    దరఖాస్తుకు చివరి తేదీ 2021 నవంబర్ 12

    NEERI Recruitment 2021: హైదరాబాద్‌లోని రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

    APPSC Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    విద్యార్హతలు- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ ఆఫ్ ఇంజనీరింగ్ (సివిల్), బ్యాచిలర్స్ ఆఫ్ టెక్నాలజీ (సివిల్) పాస్ కావాలి.

    వయస్సు- 2021 జూలై 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 42 ఏళ్లు ఉండాలి. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.

    దరఖాస్తు ఫీజు- రూ.250 అప్లికేషన్ ఫీజు, రూ.120 ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ అభ్యర్థులు, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్‌ రూ.120 ఎగ్జామినేషన్ ఫీజు చెల్లిస్తే చాలు.

    ఎంపిక విధానం- కంప్యూటర్ బేస్డ్ టెస్ట్.

    వేతనం- రూ.37,100 బేసిక్ వేతనంతో మొత్తం రూ.91,450 వేతనం లభిస్తుంది.

    ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    IBPS PO Recruitment 2021: డిగ్రీ అర్హతతో 4,135 బ్యాంక్ జాబ్స్... అప్లై చేయండి ఇలా

    APPSC Recruitment 2021: అప్లై చేయండి ఇలా


    Step 1- అభ్యర్థులు ముందుగా https://psc.ap.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

    Step 2- హోమ్ పేజీలో One Time Profile Registration పైన క్లిక్ చేయాలి.

    Step 3- ఆ తర్వాత New Registration పైన క్లిక్ చేయాలి.

    Step 4- అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతల వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.

    Step 5- యూజర్ ఐడీ జనరేట్ అవుతుంది.

    Step 6- ఆ తర్వాత లాగిన్ అయి పాస్‌వర్డ్ సెట్ చేసుకోవాలి.

    Step 7- ఆ తర్వాత https://psc.ap.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేసి వన్‌టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ నెంబర్‌తో లాగిన్ కావాలి.

    Step 8- Online Application Submission పైన క్లిక్ చేయాలి.

    Step 9- యూజర్ ఐడీ, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ చేయాలి.

    Step 10- పోస్టు పేరు సెలెక్ట్ చేసి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.

    Step 11- అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసుకొని భద్రపర్చుకోవాలి.
    Published by:Santhosh Kumar S
    First published: