APPSC Recruitment 2021: ఆంధ్రప్రదేశ్‌లో 151 ఉద్యోగాలు... దరఖాస్తుకు కొన్ని గంటలే గడువు

APPSC Recruitment 2021: ఆంధ్రప్రదేశ్‌లో 151 ఉద్యోగాలు... దరఖాస్తుకు కొన్ని గంటలే గడువు (appsc logo)

APPSC Recruitment 2021 | ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. అప్లికేషన్ ప్రాసెస్ ఇంకొన్ని గంటల్లో ముగియనుంది. విద్యార్హతల వివరాలతో పాటు ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఆయుష్ డిపార్ట్‌మెంట్‌లో ఆయుర్వేద, హోమియోపతి, యునానీ విభాగాల్లో మెడికల్ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 151 ఖాళీలు ఉన్నాయి. కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ ద్వారా ఈ పోస్టులకు ఎంపిక చేయనుంది ఏపీపీఎస్‌సీ. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది. అప్లై చేయడానికి 2021 అక్టోబర్ 25 చివరి తేదీ. రాత పరీక్షల తేదీలను ఏపీపీఎస్‌సీ తర్వాత ప్రకటిస్తుంది. అభ్యర్థులు దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి.

    APPSC Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...

























    మొత్తం ఖాళీలు 151 విద్యార్హతలు
    మెడికల్ ఆఫీసర్ (యునానీ) 26 యునానీలో డిగ్రీ పాస్ కావాలి. ఏడాది ఇంటర్న్‌షిప్ పూర్తి చేసి ఉండాలి. రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్‌గా రిజిస్ట్రేషన్ ఉండాలి.
    మెడికల్ ఆఫీసర్ (హోమియోపతి) 53 హోమియోపతిలో డిగ్రీ పాస్ కావాలి. ఏడాది ఇంటర్న్‌షిప్ పూర్తి చేసి ఉండాలి. రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్‌గా రిజిస్ట్రేషన్ ఉండాలి.
    మెడికల్ ఆఫీసర్ (ఆయుర్వేద) 72 ఆయుర్వేదలో డిగ్రీ పాస్ కావాలి. ఏడాది ఇంటర్న్‌షిప్ పూర్తి చేసి ఉండాలి. రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్‌గా రిజిస్ట్రేషన్ ఉండాలి.

    SBI SO Recruitment 2021: ఎస్‌బీఐలో 606 ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా

    APPSC Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    దరఖాస్తు ప్రారంభం- 2021 అక్టోబర్ 4

    దరఖాస్తుకు చివరి తేదీ- 2021 అక్టోబర్ 25

    విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.

    వయస్సు- 2021 జూలై 1 నాటికి 18 నుంచి 42 ఏళ్లలోపు ఉండాలి.

    దరఖాస్తు ఫీజు- రూ.250 ప్రాసెసింగ్ ఫీజు, రూ.120 ఎగ్జామ్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు రూ.120 ఎగ్జామ్ ఫీజు మినహాయింపు లభిస్తుంది.

    ఎంపిక విధానం- కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్

    మెడికల్ ఆఫీసర్ (యునానీ) నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    మెడికల్ ఆఫీసర్ (హోమియోపతి) నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    మెడికల్ ఆఫీసర్ (ఆయుర్వేద) నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    IBPS Recruitment 2021: ఐబీపీఎస్‌లో ఉద్యోగాలు... రూ.1,66,000 వరకు వేతనం

    APPSC Recruitment 2021: అప్లై చేయండి ఇలా


    Step 1- అభ్యర్థులు ముందుగా https://psc.ap.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

    Step 2- హోమ్ పేజీలో One Time Profile Registration పైన క్లిక్ చేయాలి.

    Step 3- ఆ తర్వాత New Registration పైన క్లిక్ చేయాలి.

    Step 4- అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతల వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.

    Step 5- యూజర్ ఐడీ జనరేట్ అవుతుంది.

    Step 6- ఆ తర్వాత లాగిన్ అయి పాస్‌వర్డ్ సెట్ చేసుకోవాలి.

    Step 7- ఆ తర్వాత https://psc.ap.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేసి Online Application Submission పైన క్లిక్ చేయాలి.

    Step 8- యూజర్ ఐడీ, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ చేయాలి.

    Step 9- పోస్టు పేరు సెలెక్ట్ చేసి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.

    Step 10- అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసుకొని భద్రపర్చుకోవాలి.
    Published by:Santhosh Kumar S
    First published: