హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

APPSC Recruitment 2021: ఏపీపీఎస్‌సీ జాబ్ నోటిఫికేషన్... దరఖాస్తుకు 2 రోజులే గడువు

APPSC Recruitment 2021: ఏపీపీఎస్‌సీ జాబ్ నోటిఫికేషన్... దరఖాస్తుకు 2 రోజులే గడువు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

APPSC Recruitment 2021 | ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ (DPRO) పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తోంది. అప్లై చేయడానికి మరో 2 రోజులే గడువుంది. ఈ జాబ్ నోటిఫికేషన్ (Job Notification) వివరాలతో పాటు ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి.

ఇంకా చదవండి ...

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ (DPRO) పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. ఈ జాబ్ నోటిఫికేషన్ (Job Notification) రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 4 ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు అక్టోబర్ 19న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది ఏపీపీఎస్‌సీ. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 2021 నవంబర్ 11 చివరి తేదీ. ఇక ఇప్పటికే పలు నోటిఫికేషన్ల ద్వారా వేర్వేరు పోస్టులకు దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది ఏపీపీఎస్‌సీ. ఆంధ్రప్రదేశ్‌లో 151 మెడికల్ ఆఫీసర్ పోస్టులకు, 39 హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులకు, 5 తెలుగు రిపోర్టర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పుడు 4 డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ పోస్టులకు అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభించింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, విద్యార్హతలు, అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోండి.

Railway Jobs 2021: సికింద్రాబాద్, విజయవాడ, తిరుపతిలో రైల్వే జాబ్స్... సెలెక్షన్ ప్రాసెస్ ఇదే

APPSC Recruitment 2021: ఖాళీల వివరాలు


భర్తీ చేసే పోస్టుడిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ (DPRO)
మొత్తం ఖాళీలు4
దరఖాస్తు ప్రారంభం2021 అక్టోబర్ 19
దరఖాస్తుకు చివరి తేదీ2021 నవంబర్ 11


APPSC Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


విద్యార్హతలు- ఏదైనా డిగ్రీతో పాటు జర్నలిజంలో మాస్టర్స్ డిగ్రీ పాస్ కావాలి.

వయస్సు- 2021 జూలై 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 42 ఏళ్లు ఉండాలి. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు- రూ.250 అప్లికేషన్ ఫీజు, రూ.120 ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ అభ్యర్థులు, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్‌ రూ.120 ఎగ్జామినేషన్ ఫీజు చెల్లిస్తే చాలు.

ఎంపిక విధానం- కంప్యూటర్ బేస్డ్ టెస్ట్.

వేతనం- రూ.35,120 బేసిక్ వేతనంతో మొత్తం రూ.87,130 వేతనం లభిస్తుంది.

ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

SSC Recruitment 2021: రూ.85,500 వేతనంతో 3261 జాబ్స్... సెలెక్షన్ ప్రాసెస్ ఇదే

APPSC Recruitment 2021: అప్లై చేయండి ఇలా


Step 1- అభ్యర్థులు ముందుగా https://psc.ap.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

Step 2- హోమ్ పేజీలో One Time Profile Registration పైన క్లిక్ చేయాలి.

Step 3- ఆ తర్వాత New Registration పైన క్లిక్ చేయాలి.

Step 4- అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతల వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.

Step 5- యూజర్ ఐడీ జనరేట్ అవుతుంది.

Step 6- ఆ తర్వాత లాగిన్ అయి పాస్‌వర్డ్ సెట్ చేసుకోవాలి.

Step 7- ఆ తర్వాత https://psc.ap.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేసి వన్‌టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ నెంబర్‌తో లాగిన్ కావాలి.

Step 8- Online Application Submission పైన క్లిక్ చేయాలి.

Step 9- యూజర్ ఐడీ, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ చేయాలి.

Step 10- పోస్టు పేరు సెలెక్ట్ చేసి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.

Step 11- అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసుకొని భద్రపర్చుకోవాలి.

వీటితో పాటు 6 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులకు 2021 అక్టోబర్ 22న, 6 అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, 29 అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్, 1 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, 2 హాస్టల్ వెల్‌ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 పోస్టులకు నవంబర్ 12న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఏపీపీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ https://psc.ap.gov.in/ ఫాలో కావాలి.

First published:

Tags: Andhra Pradesh, Andhra Pradesh Government Jobs, Andhra pradesh news, AP News, APPSC, CAREER, Govt Jobs 2021, Job notification, JOBS, State Government Jobs, Telugu news, Telugu varthalu

ఉత్తమ కథలు