Home /News /jobs /

APPSC Recruitment 2021: ఆంధ్రప్రదేశ్‌లో 38 నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు... దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

APPSC Recruitment 2021: ఆంధ్రప్రదేశ్‌లో 38 నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు... దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

APPSC Recruitment 2021: ఆంధ్రప్రదేశ్‌లో 38 నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు... దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
(APPSC Logo)

APPSC Recruitment 2021: ఆంధ్రప్రదేశ్‌లో 38 నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు... దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం (APPSC Logo)

APPSC Recruitment 2021 | ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నాన్ గెజిటెడ్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. ఖాళీల సంఖ్య, విద్యార్హతలు, పూర్తి వివరాలు తెలుసుకోండి.

    ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వరుసగా జాబ్ నోటిఫికేషన్స్ (Job Notifications) విడుదలవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) మరో నోటిఫికేషన్ ద్వారా నాన్ గెజిటెడ్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 38 పోస్టుల్ని భర్తీ చేయనుంది. అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, హాస్టల్ వెల్‌ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 లాంటి పోస్టులున్నాయి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2021 నవంబర్ 12న ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 డిసెంబర్ 7 చివరి తేదీ.

    APPSC Recruitment 2021: ఖాళీలు, విద్యార్హతల వివరాలు ఇవే...








































    మొత్తం ఖాళీలు 38 విద్యార్హతలు వయస్సు వేతనం
    అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ 6 జర్నలిజం లేదా పబ్లిక్ రిలేషన్స్‌లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ లేదా డిప్లొమా పాస్ కావాలి. 18 ఏళ్ల నుంచి 42 ఏళ్లు రూ.25,140 బేసిక్ వేతనంతో మొత్తం రూ.73,270 వేతనం
    అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ 29 స్టాటిస్టిక్స్‌‌లో డిగ్రీ పాస్ కావాలి. మ్యాథమెటిక్స్, ఎకనమిక్స్, కామర్స్, కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ పూర్తి చేసినవారు స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్‌లో పాస్ అయి ఉండాలి. 18 ఏళ్ల నుంచి 42 ఏళ్లు రూ.24,440 బేసిక్ వేతనంతో మొత్తం రూ.71,510 వేతనం
    ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ 1 ఫుడ్ టెక్నాలజీ, డెయిరీ టెక్నాలజీ, బయో టెక్నాలజీ, ఆయిల్ టెక్నాలజీ, అగ్రికల్చరల్ సైన్స్, వెటర్నరీ సైన్సెస్, బయో కెమిస్ట్రీ, మైక్రో బయాలజీలో డిగ్రీ లేదా కెమిస్ట్రీలో మాస్టర్స్ డిగ్రీ లేదా డిగ్రీ ఇన్ మెడిసిన్ పాస్ కావాలి. 18 ఏళ్ల నుంచి 42 ఏళ్లు రూ.28,940 బేసిక్ వేతనంతో మొత్తం రూ.78,910 వేతనం
    హాస్టల్ వెల్‌ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 2 గ్రాడ్యుయేషన్‌తో పాటు బీఈడీ పాస్ కావాలి. 18 ఏళ్ల నుంచి 42 ఏళ్లు రూ.24,440 బేసిక్ వేతనంతో మొత్తం రూ.71,510 వేతనం

    Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్... ఖాళీల వివరాలు ఇవే

    APPSC Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    దరఖాస్తు ప్రారంభం- 2021 నవంబర్ 12

    దరఖాస్తుకు చివరి తేదీ- 2021 డిసెంబర్ 7

    విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.

    వయస్సు- 18 ఏళ్ల నుంచి 42 ఏళ్లు. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.

    దరఖాస్తు ఫీజు- అప్లికేషన్ ఫీజు రూ.250, ఎగ్జామినేషన్ ఫీజ్ రూ.80 చెల్లించాలి. ఎస్‌సీ, ఎస్టీ, దివ్యాంగులు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ ఫీజు రూ.80 చెల్లించాలి.

    ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    IBPS Recruitment 2021: ప్రభుత్వ బ్యాంకుల్లో 1828 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

    APPSC Recruitment 2021: అప్లై చేయండి ఇలా


    Step 1- అభ్యర్థులు ముందుగా ఏపీపీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ https://psc.ap.gov.in/ ఓపెన్ చేయాలి.

    Step 2- హోమ్ పేజీలో వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కోసం One Time Profile Registration లింక్ పైన క్లిక్ చేయాలి.

    Step 3- ఆ తర్వాత New Registration పైన క్లిక్ చేయాలి.

    Step 4- అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతల వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.

    Step 5- యూజర్ ఐడీ జనరేట్ అవుతుంది.

    Step 6- ఆ తర్వాత లాగిన్ అయి పాస్‌వర్డ్ సెట్ చేసుకోవాలి.

    Step 7- ఆ తర్వాత https://psc.ap.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేసి Online Application Submission పైన క్లిక్ చేయాలి.

    Step 8- యూజర్ ఐడీ, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ చేయాలి.

    Step 9- పోస్టు పేరు సెలెక్ట్ చేసి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.

    Step 10- అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసుకొని భద్రపర్చుకోవాలి.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Andhra Pradesh, Andhra Pradesh Government Jobs, Andhra pradesh news, AP News, APPSC, CAREER, Govt Jobs 2021, Job notification, JOBS, State Government Jobs, Telugu news, Telugu varthalu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు