Home /News /jobs /

APPSC RECRUITMENT 2021 ANDHRA PRADESH PUBLIC SERVICE COMMISSION BEGINS APPLICATIONS FOR 190 ASSISTANT ENGINEER POSTS IN VARIOUS DEPARTMENTS KNOW HOW TO APPLY SS

APPSC Recruitment 2021: ఆంధ్రప్రదేశ్‌లో అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలు... నేటి నుంచి దరఖాస్తులు

APPSC Recruitment 2021: ఆంధ్రప్రదేశ్‌లో అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలు... నేటి నుంచి దరఖాస్తులు
(appsc logo)

APPSC Recruitment 2021: ఆంధ్రప్రదేశ్‌లో అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలు... నేటి నుంచి దరఖాస్తులు (appsc logo)

APPSC Recruitment 2021 | ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు శుభవార్త. పలు విభాగాల్లో అసిస్టెంట్ ఇంజనీర్ (Assistant Engineer) పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC).

    ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభించింది. కొద్ది రోజుల క్రితమే ఈ జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదలైంది. అక్టోబర్ 21న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 35 ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు అప్లై చేయడానికి 2021 నవంబర్ 11 చివరి తేదీ. వేర్వేరు నోటిఫికేషన్ల ద్వార అనేక ఖాళీలను భర్తీ చేస్తోంది ఏపీపీఎస్‌సీ. ప్రస్తుతం 4 డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ పోస్టులకు, 151 మెడికల్ ఆఫీసర్ పోస్టులకు, 39 హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులకు, 5 తెలుగు రిపోర్టర్ పోస్టులకు దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. తాజాగా 35 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ మొదలుపెట్టింది. ఖాళీల వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.

    Anganwadi Jobs: మహబూబ్‌నగర్ జిల్లాలో అంగన్‌వాడీ ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

    APPSC Recruitment 2021: ఖాళీల వివరాలివే...

















































     మొత్తం ఖాళీలు 190
     అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్), ఏపీ ఆర్‌డబ్ల్యూఎస్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ సబ్ ఆర్డినేట్ సర్వీస్ 24 (క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ)
     అసిస్టెంట్ ఇంజనీర్ (ఈఎన్‌వీ), పీహెచ్ అండ్ ఎంఈ సబ్ ఆర్డినేట్ సర్వీస్ 06 (క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ)
     అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్), ఏపీ పబ్లిక్ హెల్త్ అండ్ ఎంపీఎల్ ఇంజనీరింగ్ సబ్ ఆర్డినేట్ సర్వీస్ 02 (క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ)
     మునిసిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్), ఏపీ పబ్లిక్ హెల్త్ అండ్ ఎంపీఎల్ ఇంజనీరింగ్ సబ్ ఆర్డినేట్ సర్వీస్ 02 (క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ)
     అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్), ఏపీ గ్రౌండ్ వాటర్ సబ్ ఆర్డినేట్ సర్వీస్ 06 (క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ)
     అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్), ఏపీ ఆర్‌డబ్ల్యూఎస్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ సబ్ ఆర్డినేట్ సర్వీస్ 68 (ఫ్రెష్ వేకెన్సీ)
     అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్ లేదా మెకానికల్), ఏపీ పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ ఇంజనీరింగ్ సబ్ ఆర్డినేట్ సర్వీస్ 34 (ఫ్రెష్ వేకెన్సీ)
     అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్ లేదా మెకానికల్), ఎండోమెంట్ సబ్ ఆర్డినేట్ సర్వీస్ 3 (ఫ్రెష్ వేకెన్సీ)
     అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్), ఏపీ వాటర్ రీసోర్సెస్ సబ్ ఆర్డినేట్ సర్వీస్ 45 (ఫ్రెష్ వేకెన్సీ)
     అసిస్టెంట్ ఇంజనీర్ (మెకానికల్), ఏపీ వాటర్ రీసోర్సెస్ సబ్ ఆర్డినేట్ సర్వీస్ 5 (ఫ్రెష్ వేకెన్సీ)

    IBPS PO Recruitment 2021: డిగ్రీ అర్హతతో 4,135 బ్యాంక్ జాబ్స్... అప్లై చేయండి ఇలా

    APPSC Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    దరఖాస్తు ప్రారంభం- 2021 అక్టోబర్ 21

    దరఖాస్తుకు చివరి తేదీ- 2021 నవంబర్ 11

    విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. సంబంధిత బ్రాంచ్‌లో బ్యాచిలర్స్ ఆఫ్ ఇంజనీరింగ్ లేదా బ్యాచిలర్స్ ఆఫ్ టెక్నాలజీ కోర్సు పాస్ కావాలి. సంబంధిత బ్రాంచ్‌లో డిప్లొమా పాస్ అయిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేయొచ్చు.

    వయస్సు- 2021 జూలై 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 42 ఏళ్లు ఉండాలి. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.

    దరఖాస్తు ఫీజు- రూ.250 అప్లికేషన్ ఫీజు, రూ.80 ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ అభ్యర్థులు, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్‌ రూ.80 ఎగ్జామినేషన్ ఫీజు చెల్లిస్తే చాలు.

    ఎంపిక విధానం- కంప్యూటర్ బేస్డ్ టెస్ట్.

    వేతనం- రూ.31,460 బేసిక్ వేతనంతో మొత్తం రూ.84,970 వేతనం లభిస్తుంది.

    ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    వీటితో పాటు 6 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులకు 2021 అక్టోబర్ 22న, 6 అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, 29 అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్, 1 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, 2 హాస్టల్ వెల్‌ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 పోస్టులకు నవంబర్ 12న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఏపీపీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ https://psc.ap.gov.in/ ఫాలో కావాలి.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Andhra Pradesh, Andhra Pradesh Government Jobs, Andhra pradesh news, AP News, APPSC, CAREER, Govt Jobs 2021, Job notification, JOBS, Telugu news, Telugu varthalu

    తదుపరి వార్తలు