APPSC Preparation : ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం (AP Government) గుడ్ న్యూస్ చెప్పింది. రెవెన్యూ, దేవదాయశాఖల్లో ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్‌సీ (APPSC) తాజాగా ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో రెవెన్యూ శాఖలో (Revenue Department) 670 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Notification) ఇచ్చింది ఏపీపీఎస్‌సీ.. అందులో ప్రధానంగా దేవదాయ శాఖలో (Endowment Department) 60 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 30, 2021న ప్రారంభమై జనవరి 19, 2022 వరకు కొనసాగుతుంది. అప్లికేషన్ ప్రాసెస్, దరఖాస్తు విధానానికి అధికారిక వెబ్‌సైట్ https://psc.ap.gov.in/ ను సందర్శించాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ప్రిపేర్ ఎలా అవ్వాలి.. సెలబస్ ఏంటీ, పరీక్ష విధానం ఏం ఉంటుంది అనే విషయాలు తెలసుకోండి.
అప్లికేషన్ విధానం గురించి తెలుసుకోండి: డిగ్రీ అర్హతతో 730 ప్రభుత్వ ఉద్యోగాలు.. అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్
రెవెన్యూ శాఖలో ఉద్యోగాలకు పరీక్ష విధానం..
ప్రిలిమ్స్..
పేపర్ | ప్రశ్నలు | మార్కులు | సమయం |
జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ | 100 | 100 | 100 నిమిషాలు |
జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు | 50 | 50 | 50 నిమిషాలు |
మెయిన్స్..
పేపర్ | ప్రశ్నలు | మార్కులు | సమయం |
జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ | 150 | 150 | 100 నిమిషాలు |
జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు | 150 | 150 | 150 నిమిషాలు |
కప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ | - | 30 | 30 |
ఎండో మెంట్ విభాగంలో ఉద్యోగాలకు పరీక్ష విధానం..
ప్రిలిమ్స్..
పేపర్ | ప్రశ్నలు | మార్కులు | సమయం |
జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ | 50 | 50 | 50 నిమిషాలు |
హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ | 1000 | 100 | 100 నిమిషాలు |
Jobs in Telangana: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఈఎస్ఐసీలో ఉద్యోగాలు.. అప్లికేషన్ ప్రాసెస్
మెయిన్స్..
పేపర్ | ప్రశ్నలు | మార్కులు | సమయం |
జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ | 150 | 150 | 100 నిమిషాలు |
హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ | 150 | 150 | 150 నిమిషాలు |
ప్రిపరేషన్ ప్లాన్..
రెండు పరీక్షలకు ఒక పేపర్ సేమ్ ఉంది. ఈ నేపథ్యంలో రెండింటికి ప్రిపేర్ అవ్వడం ఉత్తమం. పరీక్ష తేదీలు ప్రకటించలేదని ప్రిపరేషన్ ఆలస్యం చేయకూడదు. రోజూ 3 నుంచి 4 గంటల పాటు ప్రిపరేషన్ చేయాలి. పరీక్షపై మంచి పట్టు ఉండాలంటే వారానికి ఒకసారి మోడల్ పేపర్ సాల్వ్ చేయాలి.
దరఖాస్తు విధానం..
Step 1 : అభ్యర్థులు ముందుగా ఏపీపీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ https://psc.ap.gov.in/ ఓపెన్ చేయాలి.
Step 2 : హోమ్ పేజీలో వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కోసం One Time Profile Registration లింక్ పైన క్లిక్ చేయాలి.
Step 3 : ఆ తర్వాత New Registration పైన క్లిక్ చేయాలి.
Step 4 : అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతల వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.
Step 5 : యూజర్ ఐడీ జనరేట్ అవుతుంది.
Step 6 : ఆ తర్వాత లాగిన్ అయి పాస్‌వర్డ్ సెట్ చేసుకోవాలి.
Jobs in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రీజియన్ ఈఎస్ఐసీలో ఉద్యోగాలు.. అర్హతలు ఇవే!
Step 7 : ఆ తర్వాత https://psc.ap.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేసి Online Application Submission పైన క్లిక్ చేయాలి.
Step 8: యూజర్ ఐడీ, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ చేయాలి.
Step 9 : పోస్టు పేరు సెలెక్ట్ చేసి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.
Step 10 : అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసుకొని భద్రపర్చుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, APPSC, Exam Tips, Exams, Job notification