ఏపీలో 111 గ్రూప్-1 (Group-1) పోస్టుల భర్తీకి ఈరోజు ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించింది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC). రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 18 జిల్లాల్లోని 297 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన ఈ ఎగ్జామ్ ప్రశాంతంగా ముగిసినట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పేపర్-2 పరీక్షను నిర్వహించారు. మొత్తం 83.38 శాతం హాజరు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. గ్రూప్-1కు మొత్తం 1,26,449 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 1,06,473 మంది అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. ఇందులో 87,718 మంది అభ్యర్థులు ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యారని ప్రకటనలో పేర్కొన్నారు. నంద్యాల జిల్లాలో అత్యధికంగా 85.89 % మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాగా.. కృష్ణా జిల్లాలో అత్యల్పంగా 73.99% మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.
అయితే.. విజయవాడ బెంజి సర్కిల్ లోని నారాయణ కళాశాలలో ఓ అభ్యర్థి కేంద్రంలోకి మొబైల్ ఫోన్ ను తీసుకెళ్లాడు. పోరంకి సచివాలయంలో పని చేస్తున్న ఆ ఉద్యోగి గూగుల్ ఓపెన్ చేసి మరీ పరీక్షలోని ప్రశ్నలకు సమాధానాలను గుర్తించాడు. ఇలా జవాబులు రాస్తుండగా.. అధికారులు గుర్తించారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Anganwadi Jobs: మహిళా అభ్యర్థులకు గుడ్ న్యూస్.. అంగన్ వాడీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల..
ఇక ఈ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు మూడు వారాల్లోకి వెల్లడికానున్నాయి. ఫలితాలు వెల్లడించిన 90 రోజుల వ్యవధిలోనే మెయిన్స్‌కూడా నిర్వహించనున్నట్లు ఇటీవల ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. అనంతరం జవాబుపత్రాల మూల్యాంకనానికి రెండు నెలల సమయం పడుతుందని.. ఆ తర్వాత నెలలోనే ఇంటర్వ్యూలు కూడా నిర్వహించి ఆగస్టులోగా నియామకాలు పూర్తిచేస్తామని ఆయన చెప్పారు. అంతే కాకుండా.. ప్రభుత్వం ఆమోదం లభిస్తే.. ఈ సెప్టెంబర్ లో మరో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేస్తామని కూడా తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh Government Jobs, APPSC, Group 1, JOBS, State Government Jobs