హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

APPSC Group-2 Notification: ఏపీలోని నిరుద్యోగులకు అలర్ట్.. గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల ఎప్పుడంటే?

APPSC Group-2 Notification: ఏపీలోని నిరుద్యోగులకు అలర్ట్.. గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల ఎప్పుడంటే?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఏపీలో ఇటీవల గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీపీఎస్సీ త్వరలోనే గ్రూప్-2 నోటిఫికేషన్ చేసేందుకు సిద్ధమవుతుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

ఏపీలో ఇటీవల గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీపీఎస్సీ (APPSC) త్వరలోనే గ్రూప్-2 నోటిఫికేషన్ (APPSC Group-2 Notification) చేసేందుకు సిద్ధమవుతుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ నెలలోనే దాదాపు పది రోజుల్లో గ్రూప్ 2నోటిఫికేషన్ ను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సిలబస్ ను మాత్రం అలాగే కొనసాగించాలన్న నిర్ణయానికి ఏపీపీఎస్సీ వచ్చినట్లు సమాచారం. కానీ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ విధానంలో మాత్రం మార్పులు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఏపీపీఎస్సీ పంపించిన ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద ఉన్నాయి. సర్కార్ నుంచి ఆమోదం లభించిన వెంటనే గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గ్రూప్-2 నోటిఫికేషన్ కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఏపీపీఎస్సీ (APPSC) పూర్తి చేసినట్లు సమాచారం. లక్షలాది మంది అభ్యర్థులు గ్రూప్-1 పరీక్షకు ప్రిపేర్ అవుతున్న ఈ సమయంలో గ్రూప్-2 నోటిఫికేషన్ సైతం విడుదల చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. తద్వారా రెండు నోటిఫికేషన్లకు తమ ప్రిపరేషన్ ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

రాష్ట్రంలో అత్యున్నత ఉద్యోగాల కోసం నిర్వహించే గ్రూప్ 1 నోటిఫికేషన్(Notification) ను ఏపీపీఎస్సీ(APPSC) ఇటీవల విడుదల చేసింది.  ఈ నోటిఫికేషన్ ద్వారా 92 పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు అధికారులు. ఈ పోస్టులకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ 13 నుంచి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 2 వరకు దరఖాస్తు ప్రక్రియకు అవకాశం కల్పించారు. దీంతో పాటు.. రవాణా శాఖలో 17 అసిస్టెంట్ మోటార్ వెహికిల్ Inspector (AMV) ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ ను విడుదల చేసింది ఏపీపీఎస్సీ. ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ అనేది నవంబర్ 2 నుంచి నవంబర్ 22 వరకు ఉంటుందని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.ఈ నోటిఫికేషన్లకు సంబంధించి పూర్తి వివరాలకు psc.ap.gov.inను సందర్శించవచ్చు. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను డిసెంబర్ 18, 2022న నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు మర్చి 15, 2023 తర్వాత నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

AP High Court Jobs 2022: ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త.. హైకోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలా దరఖాస్తు చేసుకోండి

విభాగాల వారీగా పోస్టుల వివరాలిలా..

1. డిప్యూటీ కలెక్టర్ - 10

2.అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ - 12

3.డిప్యూటీ సూరింటెండెంట్ ఆఫ్ పోలీస్ - 13

4.డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ - 02

5.డివిజినల్ లేదా జిల్లా ఫైర్ ఆఫీసర్స్ -02

6. అసిస్టెంట్ ట్రెసరీ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ - 08

7. రీజినల్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్ - 02

08. MPDO - 07

09. జిల్లా రిజిస్ట్రార్స్ - 03

10. జిల్లా ట్రైబల్ వెల్ ఫేర్ ఆఫీసర్స్ - 01

11. జిల్లా బీసీ వెల్ ఫేర్ ఆఫీసర్స్ - 02

12. గ్రేడ్ 2 మున్సిపల్ కమిషనర్స్ - 06

13. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లేదా లే సెక్రటరీ అండ్ గ్రేడ్ 2 ట్రెజరీ -04

First published:

Tags: Andhra pradesh news, APPSC, JOBS

ఉత్తమ కథలు