• Home
  • »
  • News
  • »
  • jobs
  • »
  • APPSC PLAN FOR FUTURE TO CANCEL PRELIMS IN GROUP 2 AND GROUP 3 EXAMS NGS

APPSC: గ్రూప్ పరీక్షల్లో భారీ మార్పులు.. ఉద్యోగ నియామకంలో ప్రిలిమ్స్, స్క్రీనింగ్ రద్దు

APPSC Logo

ఏపీపీఎస్సీ మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. విద్యార్థులు ఎదుర్కొంటున్న ఒత్తిడి.. ప్రైవేటు కోచింగ్ సెంటర్ల దోపీడీని అరికట్టేందుకు పరీక్షల విధానంలో మార్పులు చేస్తోంది..

  • Share this:
    ఏపీలో విద్యావిధానం మొత్తంలో భారీ మార్పులకు శ్రీకారం చుడుతోంది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే ఈ ఏడాది నుంచి డిగ్రీని ఇంగ్లీష్ మీడియంలోకి మార్చేసింది. ఇప్పుడు గ్రూప్‌ -2, గ్రూపు 3 సహా ఇతర క్యాడర్‌ పోస్టుల భర్తీ పరీక్షల విధానంలో మార్పులు చేయాలని ఏపీ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC) భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇకపై అన్నింటికీ ఒకే ఒక పరీక్ష నిర్వహించనున్నారు. మెరిట్ అభ్యర్థుల ద్వారా మాత్రమే ఆయా పోస్టులను భర్తీ చేయాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. గ్రూప్‌ –1 సహా అన్ని కేటగిరీల పోస్టుల భర్తీకి ప్రస్తుతం ప్రిలిమ్స్‌/స్క్రీనింగ్‌ టెస్టు.. అర్హత సాధించిన వారికి మెయిన్స్‌ పరీక్షను నిర్వహిస్తున్నారు. అయితే ఇకపై గ్రూప్‌ –1 మినాహా 2, గ్రూప్‌ –3 సహా ఇతర క్యాడర్‌ పోస్టులకు ప్రిలిమ్స్‌ను రద్దు చేయాలని కమిషన్‌ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఒక పరీక్షనే నిర్వహించి మెరిట్‌ అభ్యర్థులను సంబంధిత పోస్టులకు ఎంపిక చేయనుంది. దీనికి సంబంధించి ప్రతిపాదనలను రెడీ చేస్తున్నట్టు సమాచారం.

    ప్రిలిమ్, స్క్రీనింగ్ టెస్టుల కారణంగా విలువైన సమయం వృధాతోపాటు అభ్యర్ధులపై మానసిక వత్తిడి పడుతోందనే అభిప్రాయం చాలా రోజుల నుంచి నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు పలు కోచింగ్ సెంటర్‌లు.. పరీక్షల పేరుతో విద్యార్థుల ఒత్తిడిని సొమ్ము చేసుకుంటుండటంతో ఏపీపీఎస్సీ కొత్తమార్పులకు శ్రీకారం చుట్టనుంది. ప్రస్తుతం గ్రూప్-1 తో సహ అన్ని కేటగిరి పోస్టుల భర్తీకి ముందుగా ప్రిలిమ్స్, స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి అందులో అర్హత సాధించిన వారిని మెయిన్స్ రాసేందుకు అనుమతిస్తున్నారు. ఈ తరహా విధానాన్ని ఒక్క గ్రూప్ 1కే పరిమితం చేయనున్నారు. మిగిలిన ఉద్యోగ నియామకాలను పరీక్ష విధానం ద్వారానే చేయాలన్న ప్రతిపాదనలను ఏపీపీఎస్సీ రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. సమాచారం.

    ఇదీచదవండి: మంత్రి పుష్పశ్రీ వాణి కేబినెట్ నుంచి ఔట్..! ఆ ఎమ్మెల్యేకు గ్రీన్ సిగ్నల్.. కోలగట్ల పరిస్థితి ఏంటి?

    గతంలో గ్రూప్‌–1 పోస్టులకే ప్రిలిమ్స్, మెయిన్స్‌ పరీక్షల విధానం ఉండేది. అయితే గ్రూప్‌–2, గ్రూప్‌–3 పోస్టులకు ఒక పరీక్ష ద్వారానే ఎంపికలు ఉండేవి. 2014లో టీడీపీ అధికారం చేపట్టాక పోస్టుల భర్తీ విధానాన్ని మార్చింది. గ్రూప్‌–1 సహా అన్ని పోస్టులకూ ప్రిలిమ్స్‌/స్క్రీనింగ్‌ టెస్టు నిర్వహించేలా ఆదేశాలిచ్చింది. ఆ నిర్ణయాన్ని మార్చింది ప్రస్తుత ప్రభుత్వం. అయితే కోచింగ్‌ కేంద్రాల దోపిడీకి చెక్ పెట్టడమే తమ ఉద్దేశంలో అంటోంది ఏపీపీఎస్సీ. అందులో భాగంగా ప్రిలిమ్స్‌/ స్క్రీనింగ్‌ విధానాన్ని రద్దు చేసే ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ఈ విధానాన్ని మాత్రం కొందరు వ్యతిరేకిస్తుండగా.. మరికొందరు సరైన నిర్ణయం అంటూ సమర్ధిస్తున్నారు.
    Published by:Nagesh Paina
    First published: