APPSC మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు అప్లై చేశారా? అయితే.. పరీక్షా విధానం, సిలబస్ పై ఓ లుక్కేయండి

ప్రతీకాత్మక చిత్రం

ఏపీపీఎస్సీ (APPSC) ఇటీవల మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాల (Medical Officer Jobs) భర్తీకి నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఉద్యోగాలకు సంబంధించిన నియామక పరీక్షా విధానం, సిలబస్ వివరాలివే..

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఇటీవల వరుసగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు (Job Notifications) విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఆయుష్ డిపార్టెంట్ లో 151 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ (APPSC Notification) విడుదలైంది. ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు భారీగా దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు ఈ రోజు అంటే అక్టోబర్ 25ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. మొత్తం మూడు విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. మెడికల్ ఆఫీసర్ (యునానీ), మెడికల్ ఆఫీసర్ (హోమియోపతి), మెడికల్ ఆఫీసర్ (ఆయుర్వేద) విభాగాల్లో 26, 53, 72 చొప్పున మొత్తం 151 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ నియామక పరీక్షకు సంబంధించిన తేదీలను ఏపీపీఎస్సీ అధికారులు త్వరలో ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆ పరీక్షలకు సంబంధించిన సిలబస్, పరీక్షా విధానంపై ఓ లుక్కేద్దాం..

    మెడికల్ ఆఫీసర్ (యునాని)-MEDICAL OFFICER (UNANI):
    ఈ నియామకాలకు సంబంధించి 450 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 పరీక్షలో 150 ప్రశ్నలు ఉంటాయి. 150 నిమిషాల సమయం ఉంటుంది. జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన ప్రశ్నలు పేపర్-1 లో ఉంటాయి. పేపర్ - 2 లో 300 మార్కులకు 150 ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రశ్నలకు 150 నిమిషాల్లో సమాధానం చేయాల్సి ఉంటుంది. UNANI SCIENCE & UNANI GENERAL MEDICINE కు సంబంధించిన ప్రశ్నలు ఇందులో ఉంటాయి. అభ్యర్థులు పూర్తి సిలబస్ ను నోటిఫికేషన్లో చూడొచ్చు.
    APPSC Recruitment 2021: ఆంధ్రప్రదేశ్‌లో 151 ఉద్యోగాలు... దరఖాస్తుకు కొన్ని గంటలే గడువు

    మెడికల్ ఆఫీసర్ (హోమియోపతి)- MEDICAL OFFICER (HOMOEOPATHY):
    ఈ నియామకాలకు సంబంధించి మొత్తం 450 మార్కులకు గానూ రాత పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. పేపర్ 1 -150 మార్కులకు, పేపర్-2 300 మార్కులకు ఉంటుంది. పేపర్ - 1 లో జనరల్ స్టడీస్& మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన ప్రశ్నలను అడుగుతారు. పేపర్-2 లో HUMAN ANATOMY తదితర అంశాలకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. పూర్తి సిలబస్ ను నోటిఫికేషన్లో చూడొచ్చు. ఒక్కో పేపర్ కు 150 నిమిషాల చొప్పున సమయం కేటాయిస్తారు.
    BECIL Recruitment 2021: డిగ్రీ అర్హతతో ప్రముఖ సంస్థలో ఉద్యోగాలు.. రూ. 20 వేల వేతనం.. దరఖాస్తుకు ఈ రోజే లాస్ట్ డేట్

    మెడికల్ ఆఫీసర్ (ఆయుర్వేద) - MEDICAL OFFICER (AYURVEDA):
    ఈ నియామకాలకు సంబంధించి సైతం 450 మార్కులకు గాను రాత పరీక్షను నిర్వహిస్తారు. రెండు పేపర్లు ఉంటాయి. పేపర్ - 1 150 మార్కులకు, పేపర్-2 300 మార్కులకు నిర్వహిస్తారు. పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి చెందిన 150 ప్రశ్నలు ఉంటాయి. పేపర్ 2లో ఆయుర్వేదకు సంబంధించిన ప్రశ్నలకు ఉంటాయి. పూర్తి సిలబస్ ను నోటిఫికేషన్ లో చూడొచ్చు.
    Published by:Nikhil Kumar S
    First published: