హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

APPSC Group 1 Notification: నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల.. ఆ రోజున ప్రిలిమ్స్ పరీక్ష..

APPSC Group 1 Notification: నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల.. ఆ రోజున ప్రిలిమ్స్ పరీక్ష..

APPSC Group 1 Notification: నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల.. ఆ రోజున ప్రిలిమ్స్ పరీక్ష..

APPSC Group 1 Notification: నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల.. ఆ రోజున ప్రిలిమ్స్ పరీక్ష..

APPSC Group 1 Notification: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో అత్యున్న ఉద్యోగాల కోసం నిర్వహించే గ్రూప్ 1 నోటిఫికేషన్ ను ఏపీపీఎస్సీ(APPSC) విడుదల చేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో అత్యున్న ఉద్యోగాల కోసం నిర్వహించే గ్రూప్ 1 నోటిఫికేషన్(Notification) ను ఏపీపీఎస్సీ(APPSC) విడుదల చేసింది.  ఈ నోటిఫికేషన్ ద్వారా 92 పోస్టులను భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ 13 నుంచి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 2 వరకు దరఖాస్తు ప్రక్రియకు అవకాశం కల్పించారు. దీంతో పాటు.. రవాణా శాఖలో 17 అసిస్టెంట్ మోటార్ వెహికిల్ Inspector (AMV) ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ ను విడుదల చేసింది ఏపీపీఎస్సీ.

UPSC Official App: యూపీఎస్సీ మొబైల్ యాప్ విడుదల.. ఒక్క క్లిక్ తో ఉద్యోగ సమాచారం..

ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ అనేది నవంబర్ 2 నుంచి నవంబర్ 22 వరకు ఉంటుందని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.ఈ నోటిఫికేషన్లకు సంబంధించి పూర్తి వివరాలకు psc.ap.gov.in ను సందర్శించవచ్చు.

Jobs In NAL: బీటెక్(B Tech), బీఎస్సీ(B.Sc) విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఈ 75 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండిలా.. 

గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను డిసెంబర్ 18, 2022న నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు మర్చి 15, 2023 తర్వాత నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

వయోపరిమితి..

డిప్యూటీ రిజిస్ట్రార్ - 01,  అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ -01..  ఈ రెండు పోస్టులు బ్యాక్ లాగ్ పోస్టులుగా నోటిఫికేషన్ లో చూపించారు. ఈ రెండు పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థుల యొక్క వయో పరిమితి  అనేది 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

మొత్తం 13 రకాలు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల అయింది. వీటిలో కనిష్ట వయస్సు 18 ఏళ్లు ఉండగా.. కొన్ని పోస్టులకు 28ఏళ్లు, మరికొన్ని పోస్టులకు 42 ఏళ్లుగా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

జీతం..రూ. 57, 100 నుంచి రూ. 1,51,370 మధ్య చెల్లించనున్నారు.

విభాగాల వారీగా పోస్టుల వివరాలిలా..

1. డిప్యూటీ కలెక్టర్ - 10

2.అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ - 12

3.డిప్యూటీ సూరింటెండెంట్ ఆఫ్ పోలీస్ - 13

4.డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ - 02

5.డివిజినల్ లేదా జిల్లా ఫైర్ ఆఫీసర్స్ -02

6. అసిస్టెంట్ ట్రెసరీ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ - 08

7. రీజినల్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్ - 02

08. MPDO - 07

09. జిల్లా రిజిస్ట్రార్స్ - 03

10. జిల్లా ట్రైబల్ వెల్ ఫేర్ ఆఫీసర్స్ - 01

11. జిల్లా బీసీ వెల్ ఫేర్ ఆఫీసర్స్ - 02

12. గ్రేడ్ 2 మున్సిపల్ కమిషనర్స్ - 06

13. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లేదా లే సెక్రటరీ అండ్ గ్రేడ్ 2 ట్రెజరీ -04

PhD After Graduation: యూజీసీ కొత్త నిబంధనలు.. 4 ఏళ్ల డిగ్రీ తర్వాత నేరుగా పీహెచ్‌డీలో అడ్మిషన్ ..

అర్హతలు..

ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. డివిజినల్ లేదా జిల్లా ఫైర్ ఆఫీసర్స్ పోస్టులకు మాత్రం ఇంజనీరింగ్  ఫైర్ విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులుగా పేర్కొన్నారు. ఒక వేళ అభ్యర్థులకు ఇలాంటి అర్హత లేకుంటే.. బ్యాచిలర్ డిగ్రీని అర్హతగా పరిగణించనున్నారు.

Published by:Veera Babu
First published:

Tags: Andhra Pradesh Government Jobs, APPSC, Career and Courses, Group 1, JOBS, Public service

ఉత్తమ కథలు