హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Group 4 Hall Tickets: గ్రూప్ 4 అడ్మిట్ కార్డ్స్ విడుదల.. డౌన్ లోడ్ చేసుకోండిలా..

Group 4 Hall Tickets: గ్రూప్ 4 అడ్మిట్ కార్డ్స్ విడుదల.. డౌన్ లోడ్ చేసుకోండిలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC)  రెవెన్యూ శాఖలో 670 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ (గ్రూప్-4) ఉద్యోగాలకు (APPSC Group-4) సంబంధించి మెయిన్స్ పరీక్ష హాల్ టికెట్స్ ను విడుదల చేసింది. 

  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC)  రెవెన్యూ శాఖలో 670 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ (గ్రూప్-4) ఉద్యోగాలకు (APPSC Group-4) సంబంధించి మెయిన్స్ పరీక్ష హాల్ టికెట్స్ ను విడుదల చేసింది.  ఏప్రిల్ 4న జిల్లా కేంద్రాల్లో రెండు షిఫ్టుల్లో ఈ ఎగ్జామ్ ను నిర్వహించనున్నట్లు తెలిపింది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ (CBT) విధానంలో ఈ ఎగ్జామ్ ను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లను అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది.

మొత్తం 670 పోస్టులకు గాను స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించగా 2,11,341 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇందులో 11,574 మంది మెయిన్స్ కు అర్హత సాధించారు. మెయిన్స్ లో అభ్యర్థులు సాధించిన మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

హాల్ టికెట్స్ ఇలా డౌన్ లోడ్ చేసుకోండి.. 

-ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.

-ఇక్కడ పేర్కొన్న విధంగా యూజర్ ఐడీ, పాస్ వర్డ్ , క్యాప్షాను ఎంటర్ చేయండి.

-తర్వాత లాగిన్ అప్షన్ సెలెక్ట్ చేసుకొని.. హాల్ టటికెట్స్ ను డౌన్ లోడ్ చేసుకోండి.

AP Group-1 Mains: ఏపీలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు వాయిదా..కొత్త డేట్స్ ఇవే..

ఇదిలా ఉండగా.. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం 111 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయయగా.. ఒక్క పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్స్ పరీక్షకు అభ్యర్థులను ఎంపిక చేశారు. వీటితో పాటే.. మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ కూడా ప్రకటించారు. ఏప్రిల్ 23 నుంచి ఏప్రిల్ 29 వరకు నిర్వహించనున్నట్లు ఇటీవల ప్రకటించగా.. తాజాగా మెయిన్స్ షెడ్యూల్ లో మార్పులు చోటు చేసుకున్నాయి. దీనిని జూన్ 03 నుంచి జూన్ 09 వరకు నిర్వహించనున్నట్లు తాజాగా ఏపీపీఎస్సీ పేర్కొంది. 2022 యూపీఎస్సీ సివిల్ ఇంటర్వ్యూ షెడ్యూల్ కారణంగానే.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.

First published:

Tags: Andhra Pradesh Government Jobs, APPSC, JOBS

ఉత్తమ కథలు