APPSC Group 2 : రేపే గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ ఆన్సర్ కీ రిలీజ్

మే 5, 2019న జరిగిన APPSC గ్రూప్ 2 ఆన్సర్ కీని త్వరలోనే విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

news18-telugu
Updated: May 6, 2019, 11:48 AM IST
APPSC Group 2 : రేపే గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ ఆన్సర్ కీ రిలీజ్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 పోస్టుల కోసం నిర్వహించిన మే 5 నిర్వహించిన స్క్రీనింగ్ టెస్ట్ ఆనర్ కీ త్వరలోనే విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ‘కీ’ అభ్యర్థులు అఫిషియల్ వెబ్‌సైట్ psc.ap.gov.in లో చూడొచ్చని తెలిపారు. అధికారిక వెబ్‌సైట్‌లో తప్ప మిగతా సైట్స్‌లో వచ్చే ఏ ఆన్సర్ కీని నమ్మకూడదని అధికారులు అభ్యర్థులను కోరారు.

APPSC గ్రూప్ 2 సర్వీసెస్ స్క్రీనింగ్ టెస్ట్‌ని మే 5న నిర్వహించింది. ఈ పరీక్ష కోసం మొత్తం 2,95,036 మంది అభ్యర్థులు అప్లై చేసుకోగా.. 2,28,263 మంది హాల్‌టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఇందులో 1,77,876 మంది మాత్రమే ఎగ్జామ్‌కి హాజరయ్యారని అధికారులు తెలిపారు. ఏపీ వ్యాప్తంగా 727 సెంటర్స్‌లో పరీక్షను నిర్వహించారు.

ఏపీపీఎస్సీ మొత్తం 446 పోస్టుల కోసం అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం జనవరి 1న నోటిఫికేషన్ జారీ చేసి జనవరి 31 వరకు దరఖాస్తులు స్వీకరించారు.

First published: May 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు