APPSC Results : గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల.. ఇక్కడ చెక్ చేసుకోండి..

APPSC Group-1 Prelims Results :అంతకుముందు టీడీపీ హయాంలో ఇచ్చిన జీవో ప్రకారం 1:12 చొప్పున మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేసేందుకు అవకాశం ఉండగా.. వైసీపీ ప్రభుత్వం దాన్ని సవరించింది. అభ్యర్థుల విన్నపం మేరకు 1:50 నిష్పత్తిలో మెయిన్స్‌ ఫలితాలను ప్రకటించింది.

news18-telugu
Updated: November 2, 2019, 9:38 AM IST
APPSC Results : గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల.. ఇక్కడ చెక్ చేసుకోండి..
APPSC Group-1 Prelims Results :అంతకుముందు టీడీపీ హయాంలో ఇచ్చిన జీవో ప్రకారం 1:12 చొప్పున మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేసేందుకు అవకాశం ఉండగా.. వైసీపీ ప్రభుత్వం దాన్ని సవరించింది. అభ్యర్థుల విన్నపం మేరకు 1:50 నిష్పత్తిలో మెయిన్స్‌ ఫలితాలను ప్రకటించింది.
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) గ్రూప్‌–1 ప్రిలిమ్స్ పరీక్షల ఫలితాలను శుక్రవారం విడుదల చేసింది. గ్రూప్-1 స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాల విడుదలపై గతంలో విధించిన 'స్టే'ను హైకోర్టు ఎత్తివేయడంతో ఫలితాలు విడుదలయ్యాయి. ప్రిలిమ్స్‌ పేపర్-1, పేపర్‌-2 ఫైనల్ కీ సెట్‌ను కూడా అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. తాజా ఫలితాల్లో మొత్తం 8351 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించారు. అంతకుముందు టీడీపీ హయాంలో ఇచ్చిన జీవో ప్రకారం 1:12 చొప్పున మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేసేందుకు అవకాశం ఉండగా.. వైసీపీ ప్రభుత్వం దాన్ని సవరించింది. అభ్యర్థుల విన్నపం మేరకు 1:50 నిష్పత్తిలో మెయిన్స్‌ ఫలితాలను ప్రకటించింది. మెయిన్స్‌ అర్హత కోసం ప్రిలిమ్స్ కటాఫ్ 90.42గా నిర్దేశించారు. ప్రిలిమ్స్ పేపర్-1లో 237 మంది అభ్యర్థులను, పేపర్-2లో 300 మంది అభ్యర్థులను ఏపీపీఎస్సీ రిజక్ట్ చేయడం గమనార్హం.గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు డిసెంబర్ 12 నుంచి 23వ తేదీ వరకు మొత్తం ఏడు సెషన్లలో ఆఫ్‌లైన్ పద్దతిలో జరగనున్నాయి.

ప్రిలిమ్స్ పరీక్షల ఫలితాలు ఇక్కడ తెలుసుకోండి

గ్రూప్-1 మెయిన్స్‌కు అర్హత సాధించిన అభ్యర్థుల ఫలితాల వివరాలు

గ్రూప్-1 ప్రిలిమ్స్‌కు హాజరైన మొత్తం అభ్యర్థుల ఫలితాల వివరాలు


ప్రిలిమ్స్ పేపర్-1 స్క్రీనింగ్ టెస్టులో రిజెక్ట్ కాబడ్డ అభ్యర్థుల వివరాలు
ప్రిలిమ్స్ పేపర్-2 స్క్రీనింగ్ టెస్టులో రిజెక్ట్ కాబడ్డ అభ్యర్థుల వివరాలు
First published: November 2, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...