ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఇటీవల గ్రూప్–1 నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ (AP Jobs Notification) ద్వారా మొత్తం 91 ఖాళీలను (Jobs) భర్తీ చేయనున్నారు. వాస్తవానికి ఇందుకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 2వ తేదీన ముగియాల్సి ఉంది. కానీ.. అభ్యర్థుల నుంచి వచ్చిన వినతులతో ఈ దరఖాస్తుల గడువును ఈ నెల 5 వ తేదీ వరకు పొడిగించింది APPSC. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ రోజు అర్థరాత్రి లోపు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్ సైట్ https://psc.ap.gov.in/ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన విద్యార్హతల విషయానికి వస్తే.. అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ లేదా అందుకు సమానమైన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తు చేసుకునే జనరల్ అభ్యర్థులు రూ. 370, SC/ST/BC/PH/Ex-Service అభ్యర్ధులు రూ.120లు అప్లికేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
Mega Job Mela in AP: ఏపీలో నేడు భారీ జాబ్ మేళా.. 22 కంపెనీల్లో 1500లకు పైగా జాబ్స్ .. రూ.30 వేల వేతనంతో..
ఇందుకు సంబంధించిన ప్రిలిమినరీ రాత పరీక్షను డిసెంబర్ 18, 2022న నిర్వహించనున్నారు. మెయిన్స్ ఎగ్జామ్ ను వచ్చే ఏడాది అంటే 2023 మార్చిలో నిర్వహించనున్నారు. ఇంకా వేతనాల విషయానికి వస్తే.. ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా నెలకు రూ. 54,060-రూ.1,51,370 వరకు వేతనంగా చెల్లించనున్నారు.
విభాగాల వారీగా పోస్టుల వివరాలిలా..
1. డిప్యూటీ కలెక్టర్ - 10
2.అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ - 12
3.డిప్యూటీ సూరింటెండెంట్ ఆఫ్ పోలీస్ - 13
4.డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ - 02
5.డివిజినల్ లేదా జిల్లా ఫైర్ ఆఫీసర్స్ -02
6. అసిస్టెంట్ ట్రెసరీ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ - 08
7. రీజినల్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్ - 02
08. MPDO - 07
09. జిల్లా రిజిస్ట్రార్స్ - 03
10. జిల్లా ట్రైబల్ వెల్ ఫేర్ ఆఫీసర్స్ - 01
11. జిల్లా బీసీ వెల్ ఫేర్ ఆఫీసర్స్ - 02
12. గ్రేడ్ 2 మున్సిపల్ కమిషనర్స్ - 06
13. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లేదా లే సెక్రటరీ అండ్ గ్రేడ్ 2 ట్రెజరీ -04
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh Government Jobs, APPSC, Group 1, JOBS, State Government Jobs