ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఈ నెల 4న మరో భారీ జాబ్ మేళాను (Job Mela) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ (Job Registration) చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్ మేళాను విశాఖపట్నం జిల్లాలోని గాజువాకలో నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళాలో 10 ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నాయి. ఈ కంపెనీల్లో దాదాపు 800 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
Pfizer: ఈ సంస్థలో 46 మానిఫాక్చరింగ్ ఆపరేటర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఫార్మసీ, కెమికల్ ఇంజనీర్, కెమికల్ సైన్స్ లో డిప్లొమా చేసిన వారు అప్లై చేసుకోవచ్చు.
ACT Fiber Net: ఈ సంస్థలో 15 ఖాళీలు ఉన్నాయి. ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, ఫీల్డ్ నెట్వర్క్ ఇంజనీర్స్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.15 వేల వేతనంతో పాటు ఇన్సెంటీవ్స్ ఉంటాయి.
Apollo Pharmacy: ఈ సంస్థలో 100 ఖాళీలు ఉన్నాయి. ఫార్మసిస్ట్/రిటైల్ అసోసియేట్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఫార్మసీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు.
UPSC CSE 2023: యూపీఎస్సీ నుంచి భారీగా నోటిఫికేషన్.. 1105 పోస్టులు భర్తీ.. పూర్తి వివరాలివే..!
Global Bio Medical Services: ఈ సంస్థలో 220 ఖాళీలు ఉన్నాయి. బీటెక్, బయో మెడికల్ ఇంజనీరింగ్, బీఎస్సీ, ఐటీఐ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు వేతనం చెల్లించనున్నారు.
ATC Tires AP Pvt Ltd: ఈ సంస్థలో 100 ఖాళీలు ఉన్నాయి. ప్లాంట్ ఆపరేటర్స్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. ఐటీఐ/డిప్లొమా/బీఎస్సీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.15 వేల వేతనం చెల్లించనున్నారు.
Jayabheri Automobiles Pvt Ltd: ఈ సంస్థలో అకౌంట్స్, రిలేషన్ షిప్ మేనేజర్, టెక్నీషియన్స్, సర్వీసెస్ అడ్వైజర్స్, సెక్యూరిటీ గార్డ్స్ విభాగాల్లో 60 ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.12 వేల నుంచి రూ.18 వేల వరకు వేతనం ఉంటుంది.
@AP_Skill - @SEEDAP_AP & #EmploymentExchange has Jointly Conducting Mega Job Mela at Government ITI College, Steel City, Vikas Nagar #Gajuwaka
Registration Link: https://t.co/BHbeZS1rAX Contact: 9014772885 9292553352 APSSDC Helpline 99888 53335 pic.twitter.com/nLgILqhylo — AP Skill Development (@AP_Skill) February 1, 2023
ఇతర వివరాలు:
- అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
- రిజిస్టర్ చేసుకున్న వారికి ప్రభుత్వ ఐటీఐ కాలేజ్, స్టీల్ సిటీ, వికాస్ నగర్, గాజువాక చిరునామాలో ఈ నెల 4న ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.
- అభ్యర్థులు ఇంటర్వ్యూలకు ఫార్మల్ డ్రస్ తో రావాల్సి ఉంటుంది. ఇంకా.. Resume, విద్యార్హతల సర్టిఫికేట్ల జిరాక్స్ కాపీలను వెంట తీసుకురావాల్సి ఉంటుంది.
- అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు 9014772885, 929255352 నంబర్లను సంప్రదించాల్సి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Job Mela, JOBS, Private Jobs