వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్(Western Coalfields Limited)లో 316 అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పలు విభాగాల్లో వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ 2021 నోటిఫికేషన్ ఆధారంగా ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ అప్రెంటీస్ కోసం ఎంపికైన వారు అప్రెంటీస్ చట్టం, 1961 ప్రకారం వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్ ఒక సంవత్సరం పని చేయాల్సి ఉంటుంది. గ్రాడ్యుయేట్ (Graduates) అప్రెంటీస్‌కు ఎంపికైన వారికి రూ.9,000 స్టైఫండ్ చెల్లిస్తారు. డిప్లొమా అప్రెంటీస్(Apprentice) ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ.8,000 స్టైఫండ్ (stipend) చెల్లిస్తారు. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తులు అర్హతలు తెలసుకొందాం. ఆసక్తి ఉన్న అభ్యర్థులందరూ తప్పనిసరిగా MHRDNATS పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి.
2018 కి ముందు అర్హత పరీక్ష తీసుకున్న వారు లేదా అప్రెంటీస్‌షిప్ యాక్ట్ 1961 కింద ఏదైనా ప్రభుత్వం లేదా పీఎస్‌యు లేదా ప్రైవేట్ ఇండస్ట్రియల్ ఆర్గనైజేషన్(Industrial Organization) లో ఇప్పటికే అప్రెంటీస్‌షిప్ చేస్తున్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాదు.
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్
అర్హతలు: రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, UGC లేదా AICTE ద్వారా గుర్తింపు పొందిన సంస్థల నుంచి మైనింగ్ ఇంజనీరింగ్‌లో బీఈ, బీటెక్ లేదా ఏఎమ్ఐ చేసి ఉండాలి.
ఖాళీల సంఖ్య: 101
స్టైఫండ్ : రూ.9,000
టెక్నీషియన్ అప్రెంటీస్
అర్హతలు: రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, UGC లేదా AICT ద్వారా గుర్తింపు పొందిన సంస్థల నుంచి మైనింగ్, లేదా మైనింగ్ మరియు గని సర్వేయింగ్‌లో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
ఖాళీల సంఖ్య: 215
స్టైఫండ్ : రూ.8,000
దరఖాస్తు చేసుకొనే విధానం..
ఈ పోస్టులకు ఆసక్తి, అర్హత ఉన్న వారు NATS పోర్టల్‌లో ముందుగా తమ పేరు నమోదు చేసుకోవాలి. అనంతరం అభ్యర్థులు WCL వెబ్సైట్లో 6 సెప్టెంబర్, 2021 నుంచి 21 సెప్టెంబర్, 2021 వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు. అభ్యర్థులు తమ అర్హత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ఉద్యోగం కోసం షార్ట్‌లిస్ట్ చేయబడతారు. దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు దరఖాస్తులను సమర్పించే ముందు అధికారిక నోటిఫికేషన్ క్లిక్ చేయండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Govt Jobs 2021