హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

RRC Recruitment 2021: రైల్వేలో 3093 అప్రెంటీస్ పోస్టులు..

RRC Recruitment 2021: రైల్వేలో 3093 అప్రెంటీస్ పోస్టులు..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్(Railway Recruitment Cell), ఉత్తర రైల్వే(Northern Railway) సంస్థల్లో అప్రెంటీస్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ వెలువ‌డింది. ఈ నోటిఫికేష‌న్(Notification) ద్వారా 3093 పోస్టుల భ‌ర్తీ చేయ‌నున్నారు. దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 20న ప్రారంభం అవుతుంది.

ఇంకా చదవండి ...

  రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్(Railway Recruitment Cell), ఉత్తర రైల్వే(Northern Railway) సంస్థల్లో అప్రెంటీస్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ వెలువ‌డింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 3093 పోస్టుల భ‌ర్తీ చేయ‌నున్నారు. సెప్టెంబ‌ర్ 20, 2021 నుంచి ఆన్‌లైన్ అప్లికేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభం కానుంది. అప్రెంటీస్ యాక్ట్ 1961 ప్ర‌కారం అప్రెంటీస్ ఎంపిక ప్ర‌క్ర‌యతోపాటు అభ్య‌ర్థి అర్హ‌త‌లు నిర్దారిస్తారు. సెప్టెంబ‌ర్ 20న ప్రారంభమ‌య్యే ఈ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ అక్టోబ‌ర్ 20(October 20) వ‌ర‌కు కొన‌సాగుతుంది. పూర్తి వివ‌రాల కోసం రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్(RRC) అధికారిక వెబ్‌సైట్‌ rrcnr.org ను సంద‌ర్శించాల్సి ఉంటుంది.  అప్రెంటీస్ కాలపరిమితి, జీత భత్యాలు,  ఎంపిక విధానం సెప్టెంబర్ 20న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ సమయంలో వెలవరిస్తారు.   ఆసక్తిగల అభ్యర్థులు అధికారికి వెబ్‌సైట్‌(Website) ను సందర్శించాలి.

  నోటిఫికేషన్ పబ్లిషింగ్ తేదీసెప్టెంబర్ 14, 2021
  ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం సెప్టెంబర్ 20, 2021
  ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ముగింపు అక్టోబర్ 20, 2021


  BPCL Recruitment 2021: బీపీసీఎల్‌లో ఉద్యోగాలు.. నేరుగా ఇంట‌ర్వ్యూ ద్వారా ఎంపిక‌


  ద‌ర‌ఖాస్తు చేసుకొనేందుకు అర్హ‌త‌లు

  - పోస్టులకు దరఖాస్తు(Application) చేసుకోవాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా 10+2 లేదా 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

  - తప్పనిసరిగా గుర్తింపు(Recognized) పొందిన సంస్థ నుంచి సంబంధిత ట్రేడ్‌లలో ITI కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి.

  - ఐటీఐకి సంబంధించిన డాక్యుమెంట్లు(Documents) క‌చ్చితంగా క‌లిగి ఉండాలి.

  - ద‌ర‌ఖాస్తు చేసుకొనే అభ్యర్థి వయ‌సు 15 ఏళ్లు నుంచి 24 ఏళ్లు మ‌ధ్య ఉండాలి.

  అప్రెంటీస్‌షిప్ శిక్షణ

  - ఎంపికైన అభ్యర్థులు అప్రెంటీస్‌(Apprentice)గా నియ‌మింప‌బ‌డ‌తారు.

  - అప్రంటీస్ కాలప‌రిమితి వివ‌రాలు ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం అయ్యాక పేర్కొంటారు.

  - శిక్ష‌ణ కాలంలో ఇచ్చే జీత‌భ‌త్యాలు(salary) కూడా ముందుగానే ప్ర‌క‌టిస్తారు.

  Published by:Sharath Chandra
  First published:

  Tags: Govt Jobs 2021, Railway Apprenticeship, Railway information, Railway jobs

  ఉత్తమ కథలు