స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ SSC GD కానిస్టేబుల్ రిక్రూట్మెంట్(Recruitment) 2021 ద్వారా 25,271 ఖాళీలను భర్తీ చేసేందుకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాల దరఖాస్తుకు ఆగస్టు 31, 2021తో గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు చివరి రోజు వరకు ఆలస్యం చేయకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని కమిషన్ సూచిస్తోంది.
తాజాగా అస్సాం రైఫిల్స్ పరీక్ష, 2021 లో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF లు), NIA, SSF , రైఫిల్మన్ (GD) లో కానిస్టేబుల్స్ (GD) కోసం అభ్యర్థుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని తొందరగా దరఖాస్తు చేసుకొండని సూచిస్తోంది. చివరి నిమిషంలో సాంకేతికి సమస్యలతో ఇబ్బంది పడొద్దని తెలిపింది. దరఖాస్తు గడువు పొడిగించే అవకాశం లేదని.. అభ్యర్థులు ఆగస్టు 31, 2021లోపు దరఖాస్తు చేసుకోవాలని కమిషన్ స్పష్టం చేసింది.
దరఖాస్తు చేసుకొనేందుకు అర్హతలు ఇవే..
దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఆగస్టు 2, 1998 నుంచి ఆగస్టు 1, 2003 మధ్య జన్మించి ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయోపరిమితి, ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు వయోపరిమితి సడలింపు ఉంది. అభ్యర్థులు గుర్తిపంపు పొందిన బోర్డు, యూనివర్సిటీ నుంచి మెట్రిక్యులేషన్ లేదా పదోతరగతి (10th class) పాసై ఉండాలి.
వివిధ విభాగాల్లో పోస్టుల వివరాలు..
Total Posts | 25,271 |
CISF | 8,464 |
SSB | 3,806 |
ITBP | 1,431 |
AR | 3,785 |
SSF | 240 |
BSF | 7,545 |
SSC GD కానిస్టేబుల్ పరీక్ష 2021 కోసం పే స్కేల్:
పే లెవల్ -3 (రూ. 21700-69100).
ఎంపిక విధానం(Recruitment process)
అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), జికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (Physical Standards Test), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, వైద్య పరీక్ష (Physical Efficiency Test and Medical Examination) ద్వారా ఎంపిక చేస్తారు. కప్యూటర్ పరీక్ష ఇంగ్లీష్, హిందీలో మాత్రమే నిర్వహిస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 31లోగా https://ssc.nic.in/ వెబ్ సైట్లో అప్లై చేసుకోవాలి.
దరఖాస్తు రుసుం..
దరఖాస్తు చేసుకొంనేందుకు చెల్లించాల్సిన రుసుము రూ .100. మహిళలు, ఎస్సీ,ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులు, ఎక్స్ సర్వీస్ మెన్కు దరఖాస్తు ఫీజు మినహాయింపు ఇస్తున్నారు.
దరఖాస్తు చేసుకొనే విధానం(Application process)..
Step 1- ఎస్ఎస్సీ జీడీ(SSC GD) కానిస్టేబుల్ పోస్టులు అప్లే చేసుకొనేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
Step 2 - ఇక్కడ మీకు పలు నోటిఫికేషన్ కనపడతాయి. అందులో Constable GD ని క్లిక్ చేయండి
Step 3- అక్కడ మీకు అప్లే (Apply) అనే ఆప్షన్ కపడుతుంది.
Step 4- అందులో మీరు కొత్తగా యూజర్ నేమ్(User Name), పాస్వర్డ్ (Password) క్రియేట్ చేసుకోవాలి. ఇంతకు ముందే ఏదైనా పోస్టులకు అప్లే చేసి ఉంటే ఆ యూజర్ ఐడీ పాస్ వర్డుతో లాగిన్ అవ్వాలి.
Step 5- అనంతరం మీ విద్యార్హతలు.. ఈమెయిల్, ఉద్యోగార్హతలు(Job Qualifications) ఇవ్వాలి.
Step 6- అన్ని పూర్తయిన తర్వాత సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: ఆగస్టు 31, 2021
ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: సెప్టెంబర్ 2, 2021
ఆఫ్లైన్ చలాన్ కోసం చివరి తేదీ: సెప్టెంబర్ 7, 2021
చలాన్ ద్వారా చెల్లించడానికి చివరి తేదీ: సెప్టెంబర్ 9
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Government jobs