హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

NIN Recruitment: Inter, డిగ్రీ, పీజీ అర్హతతో.. హైదరాబాద్ NINలో పలు పోస్టుల భర్తీ.. జీతం రూ. 35 వేలు..

NIN Recruitment: Inter, డిగ్రీ, పీజీ అర్హతతో.. హైదరాబాద్ NINలో పలు పోస్టుల భర్తీ.. జీతం రూ. 35 వేలు..

NIN Recruitment: Inter, డిగ్రీ, పీజీ అర్హతతో.. హైదరాబాద్ NINలో పలు పోస్టుల భర్తీ.. జీతం రూ. 35 వేలు.. 

NIN Recruitment: Inter, డిగ్రీ, పీజీ అర్హతతో.. హైదరాబాద్ NINలో పలు పోస్టుల భర్తీ.. జీతం రూ. 35 వేలు.. 

హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రభుత్వ ఆరోగ్య సంక్షేమ మంత్రిశాఖకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషియన్ (నిన్) లో పలు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. హైదరాబాద్ లోని ఐసీఎంఆర్ - NIN ఈ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన నియమించుకోనుంది.

ఇంకా చదవండి ...

హైదరాబాద్(Hyderabad) కేంద్రంగా పనిచేస్తున్న ప్రభుత్వ ఆరోగ్య సంక్షేమ మంత్రిశాఖకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషియన్ (నిన్) లో పలు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. హైదరాబాద్ లోని ఐసీఎంఆర్(ICMR - NIN) ఈ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన నియమించుకోనుంది. అర్హత, జీతం, దరఖాస్తు ప్రక్రియలాంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం. హైదరాబాద్ - తెలంగాణ లొకేషన్‌లో 5 ప్రాజెక్ట్ సూపర్‌వైజర్, ప్రాజెక్ట్ రీసెర్చ్ అసిస్టెంట్ ఖాళీల కోసం దరఖాస్తులను(Applications) ఆహ్వానిస్తోంది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అధికారులు ఇటీవల వాకిన్ మోడ్ ద్వారా 6 పోస్టుల భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్‌ను ప్రచురించారు. అర్హత ఉన్న అభ్యర్థులందరూ NIN కెరీర్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

Google Job Vacancy 2022: మీరు డిగ్రీ పూర్తి చేశారా.. అయితే ఇదిగో Google మీ కోసం ఉద్యోగాలను భర్తీ చేస్తోంది..


పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్‌, పీజీ డిగ్రీల్లో అర్హత సాధించిన వారెవైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. వీటిలో ప్రాజెక్ట్ సూపర్ వైజర్ పోస్టులు జనరల్ కేటగిరీ కింద ఒక పోస్టు, ప్రాజెక్ట్ ఫీల్డ్ వర్కర్ పోస్టులు జనరల్ కింద 2, ఓబీసీ కింద 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

సంస్థ పేరు : నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ( NIN )

పోస్ట్ వివరాలు : ప్రాజెక్ట్ సూపర్‌వైజర్, ప్రాజెక్ట్ రీసెర్చ్ అసిస్టెంట్

మొత్తం పోస్టుల సంఖ్య : 5

జీతం: నెలకు రూ. 20,000 – 35,000

ఉద్యోగం స్థానం: హైదరాబాద్ – తెలంగాణ

అప్లై మోడ్ : వాకిన్ ఇంటర్వ్యూ

అధికారిక వెబ్‌సైట్ : nin.res.in

ముఖ్యమైన తేదీలు:

నోటిఫికేషన్ విడుదల తేదీ: 21-07-2022

వాక్-ఇన్ తేదీ: 04-ఆగస్ట్-2022

విద్యా అర్హత వివరాలు:

విద్యా అర్హత: NIN అధికారిక నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థి ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి 12వ, డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

వయోపరిమితి: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ప్రకారం, అభ్యర్థి గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు ఉండాలి. ప్రాజెక్ట్ ఫీల్ట్ వర్కర్ పోస్టులకు 30 ఏళ్లకు మించకూడదు.

వయస్సు సడలింపు:

SC/ ST అభ్యర్థులు: 05 సంవత్సరాలు

OBC కేటగిరీ అభ్యర్థులు: 03 సంవత్సరాలు

దరఖాస్తు ఫీజు : లేదు

దరఖాస్తు చేయు విధానం

ముందుగా, అధికారిక వెబ్‌సైట్ nin.res.in ని సందర్శించండి. అక్కడ వెబ్ సైట్ లో కెరీర్ అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి. అందులో మొదట కనిపించే నోటిఫికేషన్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. అందులో అర్హత వివరాలను చూసుకొని ఆసక్తి ఉంటే.. దరఖాస్తు ఫారమ్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. దానిని అవసరమైన వివరాలతో నింపి.. దానితో పాటు అర్హత జిరాక్స్ పత్రాలను 04-ఆగస్ట్-2022న కాన్ఫరెన్స్ హాల్ అండ్ కమిటీ రూమ్, ICMR-NIN, హైదరాబాద్‌లో వాక్-ఇన్-ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

Published by:Veera Babu
First published:

Tags: Brand Hyderabad, Career and Courses, JOBS, Nin, Private Jobs, Telangana, Telangana Government, Telangana government jobs

ఉత్తమ కథలు