India Post Jobs: పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో 10వేల ఉద్యోగాలు.. వివరాలు ఇవీ..

India Post Jobs 2019 : భారతీయ తపాలా కార్యాలయాల్లో 10,066 గ్రామీణ్ డాక్ సేవక్ పోస్టులకు పోస్టల్ డిపార్ట్ మెంట్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: August 6, 2019, 2:46 PM IST
India Post Jobs: పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో 10వేల ఉద్యోగాలు.. వివరాలు ఇవీ..
(ప్రతీకాత్మక చిత్రం)
Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: August 6, 2019, 2:46 PM IST
భారతీయ తపాలా కార్యాలయాల్లో 10,066 గ్రామీణ్ డాక్ సేవక్ పోస్టులకు పోస్టల్ డిపార్ట్ మెంట్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బిహార్, అస్సాం, పంజాబ్, గుజరాత్, కేరళ, కర్ణాటక సర్కిళ్లలో ఈ ఉద్యోగాలను ప్రకటించింది. పది లేదా తత్సమాన పరీక్షల్లో ఉత్తీర్ణులై, గణితం, ఇంగ్లిష్ కచ్చితంగా చదివి ఉండే వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. అభ్యర్థులు కచ్చితంగా స్థానిక భాషను చదివి, బేసిక్ కంప్యూటర్ ట్రైనింగ్ కోర్సు  చేసి ఉండాలి. వయసు 18 నుంచి 40 ఏళ్లలోపు ఉండాలి.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 05 ఆగస్టు 2019

దరఖాస్తుకు చివరి తేది: 04 సెప్టెంబరు 2019
ఇలా దరఖాస్తు చేసుకోవాలి..
www.appost.in వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. దరఖాస్తు మూడు దశల్లో ఉంటుంది. తొలి దశలో రిజిస్ట్రేషన్, రెండో దశలో ఫీజు చెల్లింపు, మూడో దశలో అవసరమైన దరఖాస్తులను  అప్‌లోడ్ చేయాలి.  మూడు దశలు పూర్తవగానే సబ్మిట్ నొక్కాలి. దరఖాస్తు పీడీఎఫ్‌ను డౌన్‌లోడ్ చేసుకొని భవిష్యత్తు అవసరాల కోసం భద్రపరచుకోవాలి.

First published: August 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...