Home /News /jobs /

APPLY BEFORE MARCH 30 FOR JUNE 2019 EXAM KNOW 5 BENEFITS OF QUALIFYING UGC NET SS

UGC NET 2019: యూజీసీ నెట్‌ దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్... పాసైతే 5 లాభాలు

UGC NET 2019: యూజీసీ నెట్‌ దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్... పాసైతే 5 లాభాలు

UGC NET 2019: యూజీసీ నెట్‌ దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్... పాసైతే 5 లాభాలు

NTA UGC NET 2019 | హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్‌లో 55% కన్నా ఎక్కువ మార్కులు ఉన్న మాస్టర్స్ డిగ్రీ అభ్యర్థులు యూజీసీ నెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.

    యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్(UGC NET) దరఖాస్తుకు మార్చి 30 చివరి తేదీ. మార్చి 1న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) నిర్వహిస్తోంది. అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్స్‌ పొందాలనుకునేవారు యూజీసీ నెట్ రాయాల్సి ఉంటుంది. హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్‌లో 55% కన్నా ఎక్కువ మార్కులు ఉన్న మాస్టర్స్ డిగ్రీ అభ్యర్థులు యూజీసీ నెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతీసారి 10 లక్షల మంది అభ్యర్థులు యూజీసీ నెట్ రాస్తుంటారు. వారిలో టాప్ 6 శాతం మంది పాసౌతారు.

    NTA UGC NET June 2019: గుర్తుంచుకోవాల్సిన తేదీలు ఇవే...


    ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం: 2019 మార్చి 1
    ఆన్‌లైన్‌లో దరఖాస్తులు పూర్తి చేయడానికి చివరి తేదీ: 2019 మార్చి 30
    ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: 2019 ఏప్రిల్ 1
    వెబ్‌సైట్‌లో కరెక్షన్స్‌కు గడువు: 2019 ఏప్రిల్ 7 నుంచి ఏప్రిల్ 14 వరకు
    అడ్మిట్ కార్డు విడుదల: 2019 మే 15
    పరీక్ష తేదీలు: 2019 జూన్ 20, 21, 24, 25, 26, 27, 28
    ఫలితాల విడుదల: 2019 జూలై 15

    Read this: UPSC Jobs 2019: పలు ఉద్యోగాలకు యూపీఎస్‌సీ నోటిఫికేషన్... వివరాలివే

    NTA UGC NET 2019, UGC NET exam, UGC NET june 2019, ntanet, nta net result, ugc net syllabus 2019, ugc net result, net result 2019, ఎన్‌టీఏ యూజీసీ నెట్, యూజీసీ నెట్ ఎగ్జామ్, యూజీసీ, యూజీసీ నెట్ 2019, నెట్ ఎగ్జామ్, ఎన్‌టీఏ యూజీసీ జూన్ ఎగ్జామ్
    (ప్రతీకాత్మక చిత్రం)

    NTA UGC NET June 2019: ఫీజు వివరాలు


    అన్‌రిజర్వ్‌డ్: రూ.800
    ఓబీసీ, ఈడబ్ల్యూఎస్: రూ.400
    ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్: రూ.200

    NTA UGC NET June 2019: పరీక్ష విధానం


    ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మొదటి సెషన్.
    మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు రెండో సెషన్.
    పేపర్-1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు.
    పేపర్-2లో 100 ప్రశ్నలకు 200 మార్కులు.
    నెగిటీవ్ మార్కింగ్ ఉండదు.

    Read this: Food Safety Jobs: ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్‌లో 275 ఖాళీలు

    NTA UGC NET 2019, UGC NET exam, UGC NET june 2019, ntanet, nta net result, ugc net syllabus 2019, ugc net result, net result 2019, ఎన్‌టీఏ యూజీసీ నెట్, యూజీసీ నెట్ ఎగ్జామ్, యూజీసీ, యూజీసీ నెట్ 2019, నెట్ ఎగ్జామ్, ఎన్‌టీఏ యూజీసీ జూన్ ఎగ్జామ్
    (ప్రతీకాత్మక చిత్రం)

    NTA UGC NET: పాసైతే 5 లాభాలు ఇవే...


    1. అసిస్టెంట్ ప్రొఫెసర్ కావాలంటే యూజీసీ నెట్ ఎగ్జామ్ పాస్ కావడం తప్పనిసరి. నెట్ పాసైన వారికే యూనివర్సిటీలు, కాలేజీల్లో ప్రొఫెసర్లుగా పనిచేయడానికి అవకాశం లభిస్తుంది.

    2. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌ అర్హత పొందితే ఎంఫిల్, పీహెచ్‌డీ చేసేందుకు మొదటి రెండేళ్ల పాటు నెలకు రూ.25,000 పారితోషికం లభిస్తుంది.

    3. రెండేళ్ల వ్యవధి పూర్తైన తర్వాత అభ్యర్థి ప్రోగ్రెస్ పరిశీలిస్తారు. పరిశోధనలో ప్రగతి సంతృప్తికరంగా ఉంటే సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ లభిస్తుంది. మూడేళ్ల పాటు నెలకు రూ.25,000 పారితోషికం లభిస్తుంది.

    NTA UGC NET 2019, UGC NET exam, UGC NET june 2019, ntanet, nta net result, ugc net syllabus 2019, ugc net result, net result 2019, ఎన్‌టీఏ యూజీసీ నెట్, యూజీసీ నెట్ ఎగ్జామ్, యూజీసీ, యూజీసీ నెట్ 2019, నెట్ ఎగ్జామ్, ఎన్‌టీఏ యూజీసీ జూన్ ఎగ్జామ్
    (ప్రతీకాత్మక చిత్రం)


    4. యూజీసీ నెట్ స్కోర్ ఆధారంగా ప్రభుత్వ సంస్థల్లో కూడా ఇతర ఉద్యోగాలు లభిస్తాయి. ఈ ఏడాది ONGC యూజీసీ నెట్ స్కోర్ ఆధారంగా నియామక ప్రక్రియ చేపట్టింది. ప్రైవేట్ కాలేజీల్లో కూడా యూజీసీ నెట్ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.

    5. యూజీసీ నెట్ పాసైనవాళ్లు ఔత్సాహికులకు కోచింగ్ కూడా ఇవ్వొచ్చు. యూజీసీ నెట్ పాసైనవారిని నియమించుకునే కోచింగ్ సెంటర్లున్నాయి.

    Royal Enfield: బుల్లెట్ ట్రయల్స్ 350, 500 బైకుల్ని లాంఛ్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్

    ఇవి కూడా చదవండి:

    RRB NTPC Jobs: మొత్తం 35,277 ఖాళీలు... దరఖాస్తుకు మార్చి 31 చివరి తేదీ

    DRDO Jobs: బీటెక్ చదివారా? డీఆర్‌డీఓలో ఫెలోషిప్... జీతం రూ.25,000

    Syndicate Bank Jobs: సిండికేట్ బ్యాంకులో 129 ఉద్యోగాలు... దరఖాస్తు ఇలా

     

     
    First published:

    Tags: CAREER, Exams, JOBS, NOTIFICATION, UGC NET

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు