SBI Alert: బ్యాంక్ జాబ్‌కు అప్లై చేశారా? జాగ్రత్త అంటున్న ఎస్‌బీఐ

SBI Alert | వేల ఉద్యోగాలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియామక ప్రక్రియ చేపట్టడంతో మళ్లీ మోసాలు జరగొచ్చని ఎస్‌బీఐ భావిస్తోంది. అందుకే అభ్యర్థుల్ని అప్రమత్తం చేస్తోంది.

news18-telugu
Updated: April 23, 2019, 5:11 PM IST
SBI Alert: బ్యాంక్ జాబ్‌కు అప్లై చేశారా? జాగ్రత్త అంటున్న ఎస్‌బీఐ
SBI Alert: బ్యాంక్ జాబ్‌కు అప్లై చేశారా? జాగ్రత్త అంటున్న ఎస్‌బీఐ
news18-telugu
Updated: April 23, 2019, 5:11 PM IST
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరుసగా ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. కొద్ది రోజుల క్రితం ప్రొబెషనరీ ఆఫీసర్ భర్తీ ప్రక్రియ చేపట్టింది. ఆ తర్వాత 8,653 క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. క్లర్క్ పోస్టులకు దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. అయితే నియామక ప్రక్రియ పూర్తి కాకముందే అభ్యర్థులకు అపాయింట్‌మెంట్ లెటర్స్, కాల్ లెటర్స్ పంపిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. ఇప్పటికే ఇలాంటి మోసాలు అనేకం బయటపడ్డాయి. ఇప్పుడు వేల ఉద్యోగాలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియామక ప్రక్రియ చేపట్టడంతో మళ్లీ మోసాలు జరగొచ్చని ఎస్‌బీఐ భావిస్తోంది. అందుకే అభ్యర్థుల్ని అప్రమత్తం చేస్తోంది.

Read this: SBI clerk Jobs: ఎస్‌బీఐలో 8,653 క్లర్క్ పోస్టులు... హైదరాబాద్‌లో 425 ఖాళీలు...

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో నకిలీ సెలక్షన్ లెటర్లు, జాబితాలు పంపిస్తున్నారని, వాటిని నమ్మొద్దని ఎస్‌బీఐ హెచ్చరిస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను పోలినట్టుగా ఉండే వెబ్‌సైట్స్ నిర్వహిస్తున్నారని, ఆ వెబ్‌సైట్లల్లో ఎస్‌బీఐ పేరుతో నకిలీ సెలక్షన్ జాబితాలు పోస్ట్ చేస్తున్నారని, వాటిని పట్టించుకోవద్దని చెబుతోంది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను తమ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేయమని ఎస్‌బీఐ స్పష్టం చేసింది. కేవలం రోల్ నెంబర్స్ మాత్రమే వెల్లడిస్తామని, దాంతో పాటు అభ్యర్థులకు ఎస్ఎంఎస్, ఇమెయిల్, పోస్ట్ ద్వారా సమాచారం ఇస్తామని ఎస్‌బీఐ వివరించింది.

Read this: SSC MTS Jobs: మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ విడుదల చేసిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్



మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసినట్టైతే అప్‌డేట్స్ కోసం https://www.sbi.co.in/careers లేదా https://bank.sbi/careers వెబ్‌సైట్స్ ఫాలో అవండి. రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్, పరీక్ష తేదీలు, ఇంటర్వ్యూ షెడ్యూల్, ఫలితాలన్నీ ఈ వెబ్‌సైట్లల్లోనే అప్‌డేట్ అవుతాయి. ఇవి కాకుండా ఇతర ఏ వెబ్‌సైట్స్‌ని నమ్మొద్దు. అనుమానాస్పదంగా ఉండే ఇమెయిల్స్, ఎస్ఎంఎస్‌లు పట్టించుకోవద్దు. మీకు ఏదైనా ఇమెయిల్, ఎస్ఎంఎస్ వస్తే పైన చెప్పిన వెబ్‌సైట్లల్లో అప్‌డేట్స్ చూడండి.

Realme 3 Pro: రిలీజైన రియల్‌మీ 3 ప్రో... ఎలా ఉందో చూశారా?
Loading...
ఇవి కూడా చదవండి:

SBI Loan: ఎస్‌బీఐలో ఎలక్ట్రిక్ వాహనాల లోన్‌పై డిస్కౌంట్

Jio GigaFiber: నెలకు రూ.600 చెల్లిస్తే బ్రాడ్‌బ్యాండ్, ల్యాండ్‌లైన్, టీవీ కనెక్షన్

IRCTC: ఐఆర్‌సీటీసీ టికెట్ బుకింగ్ ఏజెంట్ మీరూ కావొచ్చు... వివరాలు ఇవే
First published: April 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...