(Venu Medipelly, News18, mulugu)
దేశ రక్షణ కోసం పని చేయాలనుకుంటున్న తెలంగాణ (Telangana) విద్యార్థినిలకు ఇది గొప్ప అవకాశం. భారత ఆర్మీ , నేవీ, ఎయిర్‌ఫోర్స్ (త్రివిధ) దళాలలో పని చేయాలనుకునే యువతులకు సదవకాశం. భువనగిరి (bhongir) జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ సైనిక మహిళా డిగ్రీ గురుకుల కళాశాలలో ఇంటిగ్రేటెడ్ ఎంఏ కోర్సుల కొరకు మహిళా అభ్యర్థుల నుంచి అడ్మిషన్లు స్వీకరిస్తున్నారు. ఈ సైనిక డిగ్రీ కళాశాలలో ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఎంఏ (ఎకనామిక్స్) (ఇంగ్లీష్ మీడియం) కోర్సు 2022-23 ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం అవుతుంది. ఇందులో భాగంగా ఐదు సంవత్సరాల పీజీ డిగ్రీతో పాటు, ఫీసర్ల నియామకానికి ఉద్దేశించిన యూపీఎస్సీ ఎగ్జామ్‌లకు (UPSC) సంబంధించి రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్లతో అవసరమైన శిక్షణ కూడా అందించనున్నారు. ఈ శిక్షణ ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్, సి.ఆర్.పి.ఎఫ్ మొదలైన ఉద్యోగ పరీక్షలు రాయడానికి ఉపయోగపడుతుంది.
అర్హతలు:
- ఈ కళాశాలలో చదవడానికి కేవలం బాలికలు మాత్రమే అర్హులు
- 2021 -2022 ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- 01.07.2022 నాటికి 16 సంవత్సరాలు నిండి ఉండాలి
- ఎన్‌సీసీ, స్పోర్ట్స్ కోట రిజర్వేషన్ ఉంటుంది
- బాలికలు 152 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి
- తల్లిదండ్రుల ఆదాయం ఏడాదికి రూ. రెండు లక్షలకు మించకూడదు.
Indian Navy SSC Officer Recruitment 2022: నిరుద్యోగులకు అలర్ట్.. ఇండియన్ నేవీలో ఉద్యోగాలు .. ఈ రోజు నుంచే దరఖాస్తులు
జత చేయవలసిన సర్టిఫికెట్స్:
కులం ధ్రువీకరణ సర్టిఫికెట్, ఆదాయం ధ్రువీకరణ, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్, బోనఫైడ్ సర్టిఫికెట్, ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికెట్, ఆధార్ కార్డ్ , రేషన్ కార్డ్.
ఎంపిక విధానం:
అభ్యర్థులు దరఖాస్తులు కేవలం ఆన్లైన్ ద్వారానే సమర్పించాలి. అందుకు గానూ రూ. 100 రుసుము చెల్లించాలి
పరీక్ష మరియు ఫిజికల్ అండ్ మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు చివరి తేదీ *తేదీ 25.10.2022*
అభ్యర్థులు www.tswreis.ac.in వెబ్ సైట్ నుండి ప్రాస్పెక్ట్‌ను పొంది, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
- 30.10.2022న ప్రవేశ పరీక్ష ఉంటుంది. TSWRAFPDCW భువనగిరి కళాశాలలో పరీక్ష నిర్వహిస్తారు.
- ప్రవేశ పరీక్ష అనంతరం శారీరక దారుఢ్య పరీక్ష, మానసిక సామర్ధ్య పరీక్ష మరియు వైద్య పరీక్షలు ఉంటాయి.
- వివరాలకు ఫోన్ నెంబర్లు 7995010687, 9493964798 ను సంప్రదించవచ్చు.
Principal: TSWRAFPDCW Bhongir, Yadadri Bhuvanagiri
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Admissions, Bhongir, Career and Courses, JOBS, Local News, Ts gurukula