Home /News /jobs /

APPLICATIONS INVITING FOR JOB VACANCIES IN HDFC YALAMANCHILI FLUENTGRID AT VIZAG LOCATION NS

Job Mela in AP: ఏపీలో మరో జాబ్ మేళా.. BTech, MTech, BSc, MSc చేసిన వారికి జాబ్స్.. ఇలా రిజిస్టర్ చేసుకోండి

ఏపీలో మరో జాబ్ మేళా.. BTech, MTech, BSc, MSc చేసిన వారికి జాబ్స్.. ఇలా రిజిస్టర్ చేసుకోండి

ఏపీలో మరో జాబ్ మేళా.. BTech, MTech, BSc, MSc చేసిన వారికి జాబ్స్.. ఇలా రిజిస్టర్ చేసుకోండి

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) మరో జాబ్ మేళా(Job Mela)కు సంబంధించిన ప్రకటన విడుదల చేసింది. ఈ జాబ్ మేళా ద్వారా HDFC, Yalamanchili, Fluentgrid తదితర సంస్థల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు.

    ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుంచి ఇటీవల ఉద్యోగాల భర్తీకి వరుసగా జాబ్ మేళా (Job Mela) లకు సంబంధించి ప్రకటనలు విడుదలవుతున్న విషయం తెలిసిందే. తాజాగా సంస్థ నుంచి మరో జాబ్ మేళాకు సంబంధించిన ప్రకటన విడుదలైంది. ప్రముఖ HDFC బ్యాంక్ తో పాటు Yalamanchili Software Exports Private Limited, Fluentgrid సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి ఈ నెల 10న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు విశాఖపట్నంలో పని చేయాల్సి ఉంటుంది.

    ఖాళీలు, విద్యార్హతల వివరాలు..
    HDFC: ఈ సంస్థలో మొత్తం 20 ఖాళీలను ఈ ప్రకటన ద్వారా భర్తీ చేస్తున్నారు. ME Relationship Officer విభాగంలో ఈ ఖాళీలను అప్లై చేస్తున్నారు. ఏదైనా డిగ్రీ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.16 వేల వేతనం చెల్లించనున్నారు. అభ్యర్థుల వయస్సు 26 ఏళ్లలోపు ఉండాలని నోటిఫికేషన్లో తెలిపారు. అయితే, కేవలం పురుషులు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
    AP Jobs: ఏపీలో కరోనా.. ఆ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ఇలా అప్లై చేయండి

    Fluentgrid: ఈ సంస్థలో జూనియర్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్, ట్రైనీ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ విభాగాల్లో 60 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. బీటెక్, ఎంటెక్, ఎంసీఏ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు ఏడాదికి రూ.1.2 లక్షల నుంచి రూ.2.8 లక్షల వరకు వేతనం చెల్లించనున్నట్లు నోటిఫికేషన్లో తెలిపారు. అభ్యర్థుల వయస్సు 20-24 ఏళ్లు ఉండాలి.
    Yalamanchuli Software Exports Private Limited: ఈ సంస్థలో ఆపరేషన్స్ ఎగ్జిక్యూటీవ్ విభాగంలో 25 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. బీఎస్సీ కంప్యూటర్స్, బీసీఏ, డిప్లొమా కంప్యూటర్స్, ఎమ్మెస్సీ కంప్యూటర్స్, ఎంసీఏ, బీటెక్ కంప్యూటర్ సైన్స్ అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి ఏడాదికి రూ.1.74 లక్షల వేతనం చెల్లించనున్నారు. అభ్యర్థుల వయస్సు 21-22 ఏళ్లు ఉండాలి. అయితే కేవలం పురుషులు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు.
    Capgemini: ఫ్రెష‌ర్స్‌కి బెస్ట్ చాన్స్‌.. క్యాప్‌జెమినీలో ఉద్యోగ అవ‌కాశాలు.. అప్లికేష‌న్ ప్రాసెస్‌!

    ఇతర వివరాలు:
    -అభ్యర్థులు ముందుగా www.apssdc.in వెబ్ సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
    -ఇంటర్వ్యూకు హాజరయ్యే సమయంలో Resume, బయోడేటా ఫామ్, విద్యార్హతల సర్టిఫికేట్లు, ఆధార్ వెంట తీసుకురావాలని ప్రకటనలో స్పష్టం చేశారు.
    -అభ్యర్థులు ఇతర వివరాలకు 9010023033, 6301046329 నంబర్ ను సంప్రదించాలని సూచించారు.



    ఇంటర్వ్యూ వేధిక: అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు SVVP VMC Degree College - MVP Colony, Visakhapatnam చిరునామాలో ఈ నెల 10 ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న ఇంటర్వ్యూకు హాజరు కావాలని ప్రకటనలో స్పష్టం చేశారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: HDFC bank, Job Mela, Private Jobs, Vizag

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు