APPLICATIONS INVITING FOR ANGANWADI JOBS AT CHITTOR DISTRICT ANDHRA PRADESH NS
Anganwadi Jobs in AP: ఏపీలో టెన్త్ పాసైన మహిళలకు శుభవార్త.. అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలా అప్లై చేసుకోండి
ప్రతీకాత్మక చిత్రం
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి అధికారులు మరో నోటిఫికేషన్(Job Notification) విడుదల చేశారు. టెన్త్(Tenth) పాసైన మహిళలు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో సూచించారు.
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి అధికారులు వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారు. టెన్త్ పాసై స్థానికంగా నివాసం ఉండే మహిళలకు ఈ ఉద్యోగాలు సువర్ణావకాశంగా చెప్పుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఉన్న ఊరిలోనే ఉండి విధులు నిర్వర్తించే అవకాశం ఉంటుంది. ఇంకా ఈ ఉద్యోగాలకు ఎలాంటి ఎగ్జామ్ ఉండదు. అర్హత పరీక్ష టెన్త్ లో ఉత్తీర్ణత, ఇంటర్వ్యూ తదితర వివరాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. తాజాగా చిత్తూరు జిల్లాలో అంగన్ వాడీ పోస్టుల భర్తీకి అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పోస్టు పేరు
ఖాళీలు
అంగన్ వాడీ కార్యకర్త
110
మినీ అంగన్ వాడీ కార్యకర్త
85
అంగన్ వాడీ సహాయకురాలు
309
అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు.. Application begins- 2021 ఆగస్ట్ 26 Application Last Date- 2021 సెప్టెంబర్ 09 Salary Details: అంగన్ వాడీ కార్యకర్త ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 11500 వేతనం చెల్లిస్తారు. ఇంకా మినీ అంగన్ వాడీ కార్యకర్తకు నెలకు రూ. 7 వేలు, సహాయకురాలికి నెలకు రూ. 7 వేలు వేతనం ఉంటుంది. Educational Qualifications: అభ్యర్థులు తప్పనిసరిగా టెన్త్ పాసై ఉండాలి. స్థానికంగా నివసిస్తూ ఉండాలి. వయస్సు జులై 1 నాటికి 35 ఏళ్లలోపు ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. AP Anganwadi Jobs: ఏపీలో టెన్త్ పాసైన మహిళలకు శుభవార్త.. ఆ జిల్లాలో అంగన్ వాడీ ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి
Application Fees: దరఖాస్తు చేసుకునే సమయంలో అభ్యర్థులు రూ.30ని పరీక్ష ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు విధానం: అభ్యర్థులు ముందుగా దరఖాస్తులను ఆన్లైన్ లో లేదా ఈ లింక్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్ లోడ్ చేసకున్న దరఖాస్తులను వచ్చే నెల 9వ తేదీలోగా సంబంధిత సీడీపీఓకు సమర్పించాల్సి ఉంటుంది. Anganwadi Jobs: తెలంగాణలో అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్... ఖాళీల వివరాలు ఇవే
అభ్యర్థులు గెజిటెల్ అధికారిచే ధ్రువీకరించిన కింది సర్టిఫికేట్లను సమర్పించాల్సి ఉంటుంది..
-నేటివిటీ సర్టిఫికేట్/రెసిడెన్స్/ఆధార్
-టెన్త్ మార్క్ మెమో
-తహసీల్దార్ చే జారీ చేయబడిన కుల ధ్రువీకరణ పత్రం
-వికలాంగత్వముకు సంబంధించిన సదరం మెడికల్ సర్టిఫికేట్(దివ్యాంగులు అయితే)
-కొత్త ఫొటో(దరఖాస్తుపైన సూచించిన ప్రదేశంలో అంటించి అటెస్ట్ చేయాల్సి ఉంటుంది)
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.