Home /News /jobs /

APPLICATIONS INVITED FOR 65 POSTS IN TELANGANA HIGH COURT FULL DETAILS HERE VB

Telangana High Court Jobs: తెలంగాణ హైకోర్టులో పలు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.. దరఖాస్తు చేసుకోండిలా..

హైకోర్టు (image: Telangana High Court File Photo)

హైకోర్టు (image: Telangana High Court File Photo)

Telangana High Court Jobs: తెలంగాణ హైకోర్ట్‌ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు జులై 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తెలంగాణ హైకోర్ట్‌ లో(Telangana High Court) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్(Notification) విడుదల అయింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు జులై 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా జడ్జి(Judge), రిజిస్ట్రార్‌లకు పర్సనల్‌ సెక్రటరీలు(Personnel Secretary), కోర్టు మాస్టర్‌ పోస్టులను(Court Master) భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 65 ఖాళీలను నియమించనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే.. డీగ్రీలో కామర్స్ లేదా సైన్స్ లేదా ఆర్ట్స్(Arts) లో స్పెషలైజేషన్(Specialization) చేసి ఉండాలి. లేదా తత్సమాన కోర్సులు ఉత్తీర్ణులై ఉండాలి. ఈ డగ్రీతో పాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి. దీనిలో భాగంగా షార్ట్‌హ్యాండ్‌(Shorthand), టైప్‌రైటింగ్‌ల్లో(Type Writing) అర్హత సాధించి ఉండాలి.

TS Intermediate Syllabus: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. మారిన ఆ పేపర్ సిలబస్.. వివరాలిలా..


జూలై 1, 2022 నాటికి అభ్యర్థులు తప్పనిసరిగా 18 సంవత్సరాలు పూర్తయి ఉండాలి. 34 సంవత్సరాల వయస్సు పూర్తి కాకూడదు. ఏజెన్సీ ప్రాంతాల్లోని SCలు మరియు STలు లేదా ఆదివాసీ తెగలు, BCలు మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు (EWS) గరిష్ట వయోపరిమితిలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఐదు సంవత్సరాలు ఇచ్చారు. వికలాంగ అభ్యర్ధులకు 10 యేళ్ల సడలింపు వర్తిస్తుంది.మాజీ సైనికులకు సంబంధించి గరిష్ట వయోపరిమితిలో సడలింపు తెలంగాణ రాష్ట్ర మరియు సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ప్రకారం ఉంటుంది. OC మరియు BC వర్గాలకు చెందిన అభ్యర్థులు పరీక్ష ఫీజు కింద రూ.800, ఎస్సీ, ఎస్టీలు మరియు EWS కేటగిరీ అభ్యర్థులు రూ.400 చెల్లించాలి.

స్పోర్ట్స్ కోటా మరియు ఎక్స్-సర్వీస్‌మెన్ కేటగిరీ కింద దరఖాస్తు చేసుకునే వారు అభ్యర్థులకు వారి సంబంధిత తరగతి మరియు కేటగిరీ ప్రకారం నిర్దేశించిన విధంగా పరీక్ష రుసుము చెల్లించాల్సి ఉంటుంది. పరీక్ష ఫీజును “The Registrar (Recruitment), High Court for the State of Telangana”,కు అనుకూలంగా డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా చెల్లించవలసి ఉంటుంది. దీంతో పాటు.. పూరించిన దరఖాస్తును స్పీడ్ పోస్ట్ లేదా కొరియర్ ద్వారా లేదా కవరుపై Application for the post of Master/Personal Secretary-2022’ to the Registrar (Recruitment), High Court for the State of Telangana, Hyderabad-500026కు పోస్టు ద్వారా జులై 22 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులు పంపించాలి. రాత పరీక్ష ఆధారంగా ఈ ఎంపికలు ఉంటాయి. పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ https://tshc.gov.in/ ను సందర్శించాలి. నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Highcourt, JOBS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు