హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TSPSC Alert: అభ్యర్థులకు అలర్ట్.. రేపు ఉదయం 10 గంటలకు ప్రారంభం..

TSPSC Alert: అభ్యర్థులకు అలర్ట్.. రేపు ఉదయం 10 గంటలకు ప్రారంభం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో టీఎస్పీఎస్సీ(TSPSC) నుంచి గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. మొత్తం 783 గ్రూప్-2 ఖాళీలకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనికి సంబంధించి అప్లికేషన్ల ప్రక్రియ మొదలు కాబోతోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

తెలంగాణలో టీఎస్పీఎస్సీ(TSPSC) నుంచి గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. మొత్తం 783 గ్రూప్-2 ఖాళీలకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు జనవరి 18 నుంచి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే రేపు ఉదయం 10 గంటల నుంచి ఈ పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ  ఫిబ్రవరి 16 వరకు ఉంటుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులకు ఆ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలు, నోటిఫికేషన్ కు సంబంధించిన అప్డేట్స్ కోసం కమిషన్ వెబ్ సైట్ https://www.tspsc.gov.in/ ను సందర్శించాలని టీఎస్పీఎస్సీ సూచించింది. .

మొత్తం 783 పోస్టుల్లో..

1. మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌–3 - 11 పోస్టులు.

2. అసిస్టెంట్‌ కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్ - 59

3. డిప్యూటీ తహసీల్దార్‌ (నాయిబ్‌ తహసీల్దార్‌) - 98

4. సబ్‌ రిజిస్ట్రార్‌ గ్రేడ్‌–2 - 14

5. అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ (కో–ఆపరేటివ్‌ సబ్‌ సర్వీసెస్‌) - 63

6. అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్ - 09

7. ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ (మండల పంచాయతీ అధికారి) - 126

8. ఎక్సైజ్‌ సబ్‌ ఇన్‌ స్పెక్టర్ - 97

9. అసిస్టెంట్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌(హ్యాండ్‌లూమ్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌) - 38

10. అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌(జనరవ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్) - 165

11. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ సెక్రటేరియట్ - 15

12. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ లెజిస్లేటివ్ సెక్రటేరియట్ - 25

13. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ లా డిపార్ట్ మెంట్ - 07

14. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ తెలంగాణ ఎలక్షన్ కమిషనర్ - 02

15. డ్రిస్టిక్ట్‌ ప్రొబేషన్‌ ఆఫీసర్‌ (జువైనల్‌ కరెక్షనల్‌ సర్వీస్‌) - 11

16. అసిస్టెంట్‌ బీసీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ (బీసీ వెల్ఫేర్‌ సబ్‌ సర్వీస్‌) - 17

17. అసిస్టెంట్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ (ట్రైబల్‌ వెల్ఫేర్‌ సబ్‌ సర్వీస్‌) - 09

18. అసిస్టెంట్‌ సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ (ఎస్సీడీడీ సబ్‌ సర్వీస్‌) - 17

మొత్తం 18 విభాగాల్లో ఈ గ్రూప్ 2 పోస్టులను భర్తీ చేయనున్నారు.

అర్హతల విషయానికి వస్తే..

ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు.. పోస్ట్ కోడ్ నంబర్ 01 నుంచి 12 వరకు పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. వీటితో పాటు.. పోస్ట్ కోడ్ నంబర్ 14, 16, 17, 18 లకు కూడా ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

-పోస్ట్ కోడ్ నంబర్ 13 అనగా.. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ లా డిపార్ట్ మెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు లా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. వీటిలో 07 పోస్టులు ఉన్నాయి.

LIC AAO Jobs: భారీ నోటిఫికేషన్ విడుదల చేసిన LIC.. ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ..

-పోస్ట్ కోడ్ నంబర్ 15 అనగా..డ్రిస్టిక్ట్‌ ప్రొబేషన్‌ ఆఫీసర్‌ (జువైనల్‌ కరెక్షనల్‌ సర్వీస్‌) పోస్టులకు సోషల్ వర్క్ లేదా సైకాలజీలో డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. వీటిలో 11 పోస్టులు ఉన్నాయి.

-వీటితో పాటు.. ఎక్సైజ్ సబ్ ఇన్ స్పెక్టర్ పోస్టులకు డిగ్రీతో పాటు.. ఫిజికల్ మీజర్ మెంట్స్ ఉండాలి. పురుష అభ్యర్థులకు 167.6 సెం.మీ, మహిళలకు 152.5 సెం.మీ ఎత్తు ఉండాలి. అంతే కాకుండా.. ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి యొక్క వయస్సు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5 ఏళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది.

వయోపరిమితి..

అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5 ఏళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు..

అభ్యర్థులు రూ.200 అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పై నిబంధనలను దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులు దరఖాస్తులో ఎలాంటి తప్పులు లేకుండా అప్లై చేయాలని టీఎస్పీఎస్సీ సూచించింది.

First published:

Tags: Applications, JOBS, TSPSC, Tspsc group 2

ఉత్తమ కథలు