హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

AP Jobs: నిరుద్యోగులకు అలర్ట్.. ఆ పోస్టుల దరఖాస్తులకు మరి కొన్ని గంటట్లో ముగియనున్న గడువు..

AP Jobs: నిరుద్యోగులకు అలర్ట్.. ఆ పోస్టుల దరఖాస్తులకు మరి కొన్ని గంటట్లో ముగియనున్న గడువు..

AP Jobs: నిరుద్యోగులకు అలర్ట్.. ఆ పోస్టుల దరఖాస్తులకు మరి కొన్ని గంటట్లో ముగియనున్న గడువు..

AP Jobs: నిరుద్యోగులకు అలర్ట్.. ఆ పోస్టుల దరఖాస్తులకు మరి కొన్ని గంటట్లో ముగియనున్న గడువు..

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(Andhra Pradesh Public Service Commission) ఇటీవల గ్రూప్-1 నోటిఫికేషన్(Notification) విడుదల చేసిన సంగతి తెలిసిందే. నోటిఫికేషన్ ద్వారా మొత్తం 92 పోస్టుల భర్తీ చేయనున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(Andhra Pradesh Public Service Commission) ఇటీవల గ్రూప్-1 నోటిఫికేషన్(Notification) విడుదల చేసిన సంగతి తెలిసిందే. నోటిఫికేషన్ ద్వారా మొత్తం 92 పోస్టుల భర్తీ చేయనున్నారు. గ్రూప్-1 పోస్టుల దరఖాస్తుకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబరు 13న ప్రారంభమైంది. దరఖాస్తులు చేసుకోవడానికి చివరి తేదీ నవంబర్ 2గా పేర్కొన్నారు.  అంటే దరఖాస్తుల గడువు మరి కొన్ని గంటల్లో ముగియనుంది.  ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలు.. అర్హత, దరఖాస్తు ప్రక్రియ గురించి తెలుసుకుందాం.

SSC Jobs: Degree పూర్తి చేసిన నిరుద్యోగులకు అలర్ట్.. 990 పోస్టులకు ముగుస్తున్న దరఖాస్తుల గడువు..

గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను డిసెంబర్ 18, 2022న నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు మర్చి 15, 2023 తర్వాత నిర్వహించనున్నారు.

వయోపరిమితి..

డిప్యూటీ రిజిస్ట్రార్ - 01, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ -01.. ఈ రెండు పోస్టులు బ్యాక్ లాగ్ పోస్టులుగా నోటిఫికేషన్ లో చూపించారు. ఈ రెండు పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థుల యొక్క వయో పరిమితి అనేది 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

మొత్తం 13 రకాలు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల అయింది. వీటిలో కనిష్ట వయస్సు 18 ఏళ్లు ఉండగా.. కొన్ని పోస్టులకు 28ఏళ్లు, మరికొన్ని పోస్టులకు 42 ఏళ్లుగా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

అర్హతలు..

ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. డివిజినల్ లేదా జిల్లా ఫైర్ ఆఫీసర్స్ పోస్టులకు మాత్రం ఇంజనీరింగ్ ఫైర్ విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులుగా పేర్కొన్నారు. ఒక వేళ అభ్యర్థులకు ఇలాంటి అర్హత లేకుంటే.. బ్యాచిలర్ డిగ్రీని అర్హతగా పరిగణించనున్నారు.

విభాగాల వారీగా పోస్టుల వివరాలిలా..

1. డిప్యూటీ కలెక్టర్ - 10

2.అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ - 12

3.డిప్యూటీ సూరింటెండెంట్ ఆఫ్ పోలీస్ - 13

4.డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ - 02

5.డివిజినల్ లేదా జిల్లా ఫైర్ ఆఫీసర్స్ -02

6. అసిస్టెంట్ ట్రెసరీ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ - 08

7. రీజినల్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్ - 02

8. MPDO - 07

9. జిల్లా రిజిస్ట్రార్స్ - 03

10. జిల్లా ట్రైబల్ వెల్ ఫేర్ ఆఫీసర్స్ - 01

11. జిల్లా బీసీ వెల్ ఫేర్ ఆఫీసర్స్ - 02

12. గ్రేడ్ 2 మున్సిపల్ కమిషనర్స్ - 06

13. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లేదా లే సెక్రటరీ అండ్ గ్రేడ్ 2 ట్రెజరీ -04

TSPSC Halltickets: నిరుద్యోగులకు అలర్ట్.. ఆ ఉద్యోగాలకు పరీక్ష తేదీ ఖరారు.. వివరాలిలా..

ఆన్ లైన్ లో దరఖాస్తుల ప్రక్రియ అనేది ప్రారంభం అయింది. గ్రూప్ 1కు ఇలా దరఖాస్తు చేసుకోండి.

Step 1 : మొదట అభ్యర్థులు ఓటీఆర్ ను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దాని కోసం అభ్యర్థులు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Step 2 : ఇక్కడ అభ్యర్థుల యొక్క వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. ఓటీఆర్ టైప్ లో డైరెక్ట్ రిక్రూట్ మెంట్ అనే ఆప్షన్ ను ఎంచుకొని.. దానిలో న్యూ రిజిస్ట్రేషన్ అనే ట్యాబ్ పై క్లిక్ చేయండి.

Step 3 : వీటిలో ప్రాథమిక సమాచారంతో పాటు.. అవసరమైన అర్హత సర్టిఫికేట్లను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.

Step 4 : తదుపరి ఈ మెయిల్ ఐడీకి.. మీ ఫోన్ నంబర్ కు ఓటీఆర్ నంబర్ వస్తుంది.

Step 5 : తర్వాత వెబ్ సైట్ లో ఉన్న గ్రూప్ 1 దరఖాస్తుల ప్రక్రియ అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి.

Step 6 : దీనిలో ఓటీఆర్, మొబైల్ నంబర్, క్యాప్ష ఇచ్చి Go అనే ట్యాబ్ పై క్లిక్ చేయాలి.

Step 7 : దీంతో మీ సమాచారం అంతా ఆటోమేటిక్ గా దీనిలో వచ్చేస్తుంది. వాటిని సరి చూసుకుంటే.. గ్రూప్ 1 కు సంబంధించిన అర్హత వివరాలను నమోదు చేయాలి.

Step 8 : తర్వాత ఆన్ లైన్ దరఖాస్తు సబ్ మిట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే మీ దరఖాస్తు పూర్తి అయినట్టే.

Step 9 : చివరగా.. ఆ దరఖాస్తు ఫారమ్ ను డౌన్ లోడ్ చేసుకొని.. తదుపరి అవసరాల నిమిత్తం మీ దగ్గర భద్రంగా ఉంచుకోవాలి.

First published:

Tags: Ap jobs, Career and Courses, JOBS

ఉత్తమ కథలు