టీఎస్పీఎస్సీ(TSPSC) నుంచి ఇటీవల మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమశాఖలో ఉమెన్ & ఛైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి మహిళలకు మాత్రమే అర్హత ఉంది. నేటి నుంచి అంటే.. సెప్టెంబర్ 13 ఉదయం 10 గంటల నుంచి ఈ పోస్టులకు దరఖాస్తులు (Applications) సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్(Notification) ద్వారా మొత్తం 23 పోస్టులను భర్తీ చేయనున్నారు. అక్టోబర్ 10న దరఖాస్తులకు చివరి తేదీగా పేర్కొన్నారు. ఇతర వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి తెలుసుకోవచ్చు.
మల్టీజోన్ల వారీగా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. మల్టీ జోన్ 1 లో మొత్తం 17 పోస్టులు ఉండగా.. మల్టీ జోన్ 2 లో మొత్తం 06 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 51,320 నుంచి రూ. 1,27,310 చెల్లించనున్నారు.
అర్హతల విషయానికి వస్తే..
హోం సైన్స్ లేదా సోషల్ సైన్స్, లేదా ఫుడ్ అండ్ న్యూట్రీషియన్ లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అంతే కాకుండా.. బోటనీ, బయాలజీ, బయో కెమిస్ట్రీ తో బ్యాచిలర్ డిగ్రీ చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు చేసుకోండిలా..
- అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి. దాని కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
-దీనిలో టాప్ లో అప్లికేషన్ ఫర్ ది సీడీపీఓ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానాని ఎంచుకోవాలి.
-తర్వాత అభ్యర్థుల యొక్క ఓటీఆర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ను ఎంటర్ చేసి.. దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
-ఇప్పటికే ఓటీఆర్ ను నమోదు చేసుకోలేని వారు.. అధికారిక వెబ్ సైట్ కు వెళ్లి ఓటీఆర్ ను నమోదు చేసుకోవాలి.
BEL Recruitment 2022: బీటెక్ చేసిన వారికి శుభవార్త.. భారత్ ఎలక్ట్రానిక్స్ లో జాబ్స్ .. ఇలా దరఖాస్తు చేసుకోండి
టీఎస్పీఎస్సీ వెబ్ సైట్ లో నేటి నుంచి సెప్టెంబర్ 16వ తేదీ వరకు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారు.. దరఖాస్తులో ఏమైన తప్పిదాలు ఉంటే ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ ఉద్యోగాలకు జూలై 29న అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభం అయింది. ఆగస్టు 26వరకు దరఖాస్తలును స్వీకరించారు. మొత్తం ఈ నోటిఫికేషన్ ద్వారా 24 పోస్టులను భర్తీ చేయనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, JOBS, Tspsc jobs