తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఇటీవల పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్లకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అవుతున్నాయి. గ్రూప్ 4(Group 4) దగ్గర నుంచి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్(Hostel Welfare Officer), ఫిజికల్ డైరెక్టర్, హార్టికల్చర్(Horticulture) డిపార్ట్ మెంట్లో ఖాళీ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయం, సహకార శాఖలో వ్యవసాయ అధికారుల పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 148 అగ్రికల్చర్ ఆఫీసర్(Agriculture Officer) పోస్టులను భర్తీ చేయనున్నారు. జనవరి 10 నుంచి ఈ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఫిబ్రవరి 02 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే దరఖాస్తులకు మరి కొన్ని గంటల్లో ముగియనుంది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 148 పోస్టులను భర్తీ చేస్తారు. మల్టీ జోన్ 1లో 100, మల్టీ జోన్ 2లో 48 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
బీఎస్సీ అగ్రికల్చర్ / బీఎస్సీ (ఆనర్స్) ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
జూలై 01, 2022 నాటికి అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం..
రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎలాంటి ఇంటర్వ్యూ ఉండదు.
జీతం..
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 51,320 నుంచి రూ.1,27,310 చెల్లిస్తారు.
ముఖ్యమైన తేదీలు..
ఆన్ లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: జనవరి 10, 2023.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: ఫిబ్రవరి 02, 2023
దరఖాస్తు విధానం ఇలా..
-మొదట అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి. దీని కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
-తర్వాత Agriculture Officer అప్లికేషన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
-తర్వాత ఓపెన్ అయిన పేజీలో టీఎస్పీఎస్సీ ఐడీని ఎంటర్ చేయాలి. దీంతో పాటు.. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి.
-తదుపరి గెట్ ఓటీపీ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే.. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు ఓటీపీ వస్తుంది.
-దీనికి ఎంటర్ చేయగానే.. అప్లికేషన్ పేజీలోకి వెళ్తుంది. ఇక్కడ మీ వ్యక్తిగత వివరాలను సరి చూసుకోవాలి. తర్వాత అర్హతకు సంబంధించి పూర్తి వివరాలను ఎంటర్ చేసి.. సబ్ మిట్ బటన్ క్లిక్ చేయాలి.
-తర్వాత అప్లికేషన్ ఫారమ్ ను డౌన్ లోడ్ చేసుకొని.. ప్రింట్ తీసుకోవాలి. ఇది భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.