ఇండియన్ ఆర్మీలో మహిళా అగ్నివీర్ రిక్రూట్మెంట్ (Indian Army Female Recruitment) కోసం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. దీని కోసం దరఖాస్తు(Application) చేయడానికి చివరి తేదీ 7 సెప్టెంబర్ 2022. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ Joinindianarmy.nic.inని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ప్రకారం.. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ కోసం దరఖాస్తు చేయడానికి.. అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి తప్పనిసరిగా 10వ పరీక్షలో కనీసం 45 శాతం మార్కులతో మరియు ప్రతి సబ్జెక్టులో 33 శాతం మార్కులతో(Marks) ఉత్తీర్ణులై ఉండాలి. గ్రేడింగ్ విధానాన్ని అనుసరించే బోర్డుల కోసం "C2" గ్రేడ్ అర్హత ప్రమాణాలకు సరిపోతుంది. అంతే కాకుండా మహిళ అవివాహిత అయి ఉండాలని పేర్కొన్నారు.
వయో పరిమితి
ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ కోసం దరఖాస్తు చేసుకునే మహిళా దరఖాస్తుదారుల వయస్సు 17.5 సంవత్సరాల నుండి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. 1 అక్టోబర్ 1999 నుండి 1 ఏప్రిల్ 2005 మధ్య జన్మించి ఉండాలి. రక్షణ సిబ్బంది యొక్క వితంతువులకు 30 సంవత్సరాల వరకు వయో సడలింపు అందించబడుతుంది. శిక్షణలో చేరిన తేదీకి అనుగుణంగా ఈ వయోపరిమితి సడలింపు ఉంటుంది.
అభ్యర్థుల ఎత్తు తప్పనిసరిగా కనీసం 162 సెం.మీ ఉండాలి . అదేవిధంగా, వారి బరువు తప్పనిసరిగా ఎత్తుతో పోల్చదగినదిగా ఉండాలి. అభ్యర్థుల భౌతిక అవసరాలు భారత సైన్యం నిర్ణయించిన వైద్య ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయి. కొన్ని వర్గాల అభ్యర్థులకు ఫిజికల్ స్టాండర్డ్స్‌లో కొంత సడలింపు అందించబడుతుంది.
అడ్మిట్ కార్డ్..
ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ కోసం అడ్మిట్ కార్డ్ అభ్యర్థులకు 12 నుండి 13 అక్టోబర్ 2022 మధ్య వారి ఇమెయిల్‌లో పంపబడుతుంది. రిక్రూట్మెంట్ డ్రైవ్‌కు సంబంధించిన మరింత సమాచారం కోసం, అభ్యర్థులు అధికారిక సైట్ ను సందర్శించి మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
దరఖాస్తు విధానం ఇలా..
Step 1: అభ్యర్థులు ముందుగా Joinindianarmy.nic.in అధికారిక సైట్‌కి వెళ్లాలి.
Step 2: దీని తర్వాత.. అభ్యర్థులు హోమ్‌పేజీలో ఇచ్చిన అగ్నిపథ్ విభాగానికి వెళ్లాలి.
Step 3: ఇప్పుడు దరఖాస్తుదారు ఆన్లైన్ దరఖాస్తు అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి.
Step 4: దీని తర్వాత.. అభ్యర్థులు తమ ఇమెయిల్ ఐడిని నమోదు చేయడం ద్వారా నమోదు చేసుకుంటారు.
Step 5: ఇప్పుడు అభ్యర్థులు అవసరమైన వివరాలు మరియు పత్రాలను అప్లోడ్ చేయాలి.
Step 6: ఆ తర్వాత అభ్యర్థి ఫారమ్‌ను సమర్పించాలి.
Step 7: చివరిగా.. అభ్యర్థులు ఫారమ్ యొక్క ప్రింట్ అవుట్ తీసుకోవాలి. ఇది అభ్యర్థి యొక్క భవిష్యత్ అవసరాల కొరకు ఉపయోగపడుతుంది.
ఎంపిక ప్రక్రియ..
రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత.. కటాఫ్ మెరిట్ జాబితా ప్రకారం అభ్యర్థులకు అడ్మిట్ కార్డులు జారీ చేయబడతాయి. ఈ మెరిట్ జాబితా ఖాళీల సంఖ్య మరియు 10వ తరగతిలో అభ్యర్థుల మొత్తం మార్కుల ప్రకారం తయారు చేయబడుతుంది. అప్పుడు ఎంపికైన అభ్యర్థులు వివిధ ర్యాలీ సైట్లలో ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్‌లో పాల్గొనడానికి పిలుస్తారు. వెరిఫికేషన్ కోసం అభ్యర్థులు అడ్మిట్ కార్డ్‌తో పాటు ఒరిజినల్ ధ్రువపత్రాలు తీసుకురావాలి. అక్కడ వాటిని సమర్పించాల్సి ఉంటుంది. దీని తరువాత.. తుది ఎంపిక కోసం వైద్య పరీక్ష అండ్ ప్రవేశ పరీక్ష జరుగుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Army jobs, Career and Courses, EDUCATION, Indian Army, JOBS, Students