ఇండియన్ ఆర్మీలో షార్ట్ సర్వీస్(Short Service) కమిషన్ కింద అవివాహిత పురుషులు, అవివాహిత మహిళల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది. దరఖాస్తు ఫారమ్‌ను(Application Form) సమర్పించడానికి చివరి తేదీ 15 ఫిబ్రవరి 2023. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు భారత సైన్యం యొక్క అధికారిక వెబ్‌సైట్ joinindianarmy.nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ ప్రకారం 55 ఖాళీలను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ విడుదలైంది. వాటిలో 50 ఖాళీలు NCC పురుషులకు మరియు 5 ఖాళీలు NCC మహిళలకు కేటాయించారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ లేదా తత్సమాన డిగ్రీ కలిగి ఉండాలి. డిగ్రీలో(Degree) అభ్యర్థులకు కనీసం 50 శాతం మార్కులు ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి వయస్సు 1 జూలై 2023 నాటికి 19 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తుల ప్రక్రియ ఇలా..
Step 1: అభ్యర్థులు ముందుగా joinindianarmy.nic.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి
Step 2: ఆ తర్వాత అభ్యర్థుల వ్యక్తిగత వివరాలను నమోదు చేయాలి.
Step 3: అభ్యర్థులు అవసరమైన అన్ని పత్రాలను అప్‌లోడ్ చేయాలి.
Step 4: అప్లై చేయడానికి ముందు అభ్యర్థుల యొక్క వివరాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలి.
Step 5: ఆ తర్వాత అభ్యర్థి తమ దరఖాస్తులను సమర్పించాలి.
Step 6: దరఖాస్తు ఫారమ్ ను డౌన్ లోడ్ చేసుకొని.. ప్రింట్ తీసుకోవాలి. ఇది భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడుతుంది.
మరో నోటిఫికేషన్..
హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ 54 పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక సైట్ hindustancopper.comని సందర్శించడం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 31 జనవరి 2023గా నిర్ణయించబడింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.