Haribabu, News18, Rajanna Sircilla
రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Siricill District) రూరల్, పట్టణ ప్రాంత నిరుద్యోగులకు ఉపాధినిచ్చే వృత్తి విద్యలపై శిక్షణ ఇవ్వనున్నట్లు స్థానిక స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ డైరెక్టర్ కనకయ్య తెలిపారు. అకౌంట్స్ అసిస్టెంట్ (ట్యాలీ), ఆటో మొబైల్ , టూవీలర్ సర్వీసింగ్, టెలీ కాలర్ విభాగాల్లో శిక్షణ ఇవ్వడంతో పాటు ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. నెలకు రూ.2వేలు హాస్టల్ ఫీజు చెల్లించే స్థోమత ఉండి,18 సంవత్సరాలు నిండిన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 80196 26324 నెంబర్ పై సంప్రదించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులకు ఉపాధినిచ్చే వృత్తి విద్యలపై శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు.
బీసీ నిరుద్యోగ యువతకు శిక్షణ: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నిరుద్యోగ యువతకు వివిధ రంగాల్లో నైపుణ్య అభివృద్ధి శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ డెవలప్మెంట్ అధికారి మోహన్ రెడ్డి బుధవారం ప్రకటనలో తెలిపారు. కనీసం 8వ తరగతి విద్యార్హత గల యువకులకు సేల్స్, మార్కెటింగ్, రీటైల్ సేల్స్, ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్, రీఫ్రిజరేటర్, ఏసీ రిపేర్ వంటి అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఐసీఐసీఐ అకాడమీ ఫర్ స్కిల్స్, హైదరాబాద్ సంస్థ ఆధ్వర్యంలో ఇచ్చే శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. కులం, ఆదాయ ధ్రువపత్రాలు, ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతులతో ఈనెల 23లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వివరాలకు 9912111129లో సంప్రదించాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని నిరుద్యోగ యువత ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ అధికారి మోహన్ రెడ్డి పేర్కొన్నారు.
ఓపెన్ యూనవెర్సటి అడ్మిషన్ ఫీజు చెల్లించాలి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అగ్రహరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధ్యయన కేంద్రంలో డిగ్రీ విద్యార్థులు ఈ నెల 15 వరకు ఆడ్మిషన్ ఫీజు చెల్లించాలని కళాశాల కోఆర్డినేటర్ టి.శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఐటీఐ మూడో విడత అడ్మిషన్లు: జిల్లాలోని తంగళ్లపల్లి మండలం ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలలో అడ్మిషన్ల కోసం అక్టోబర్ 13 నుంచి మూడో విడత దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా స్వీకరిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ కనకయ్య తెలిపారు. ఈ నెల 17 వరకు అవకాశం ఉందని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Telangana, Vemulawada