హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

UGC Scholarships: డిగ్రీ, పీజీ చేస్తున్న విద్యార్థులకు గుడ్ న్యూస్.. యూజీసీ నుంచి 4 స్కాలర్ షిప్ లకు దరఖాస్తుల ఆహ్వానం..

UGC Scholarships: డిగ్రీ, పీజీ చేస్తున్న విద్యార్థులకు గుడ్ న్యూస్.. యూజీసీ నుంచి 4 స్కాలర్ షిప్ లకు దరఖాస్తుల ఆహ్వానం..

UGC Scholarships: డిగ్రీ, పీజీ చేస్తున్న విద్యార్థులకు గుడ్ న్యూస్.. యూజీసీ నుంచి 4 స్కాలర్ షిప్ లకు దరఖాస్తుల ఆహ్వానం..

UGC Scholarships: డిగ్రీ, పీజీ చేస్తున్న విద్యార్థులకు గుడ్ న్యూస్.. యూజీసీ నుంచి 4 స్కాలర్ షిప్ లకు దరఖాస్తుల ఆహ్వానం..

UGC Scholarships: యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ (UGC) నాలుగు కొత్త స్కాలర్‌షిప్ స్కీమ్​లతో ముందుకు వచ్చింది. ర్యాంక్ హోల్డర్లు, సింగిల్ గర్ల్​ చైల్డ్​, షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగ (ST) విద్యార్థుల కోసం ఈ స్కాలర్​షిప్​లను ఆఫర్​ చేస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నుంచి నాలుగు స్కాలర్‌షిప్ పథకాల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హత గల అభ్యర్థులు ఈ UGC స్కాలర్‌షిప్ కోసం నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ (NSP) Scholarships.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈశాన్య ప్రాంతానికి UGC ఇషాన్ ఉదయ్ స్కాలర్‌షిప్, UGC PG ఇందిరా గాంధీ స్కాలర్‌షిప్ (పెళ్లి కాని అమ్మాయికి), యూనివర్సిటీ ర్యాంక్ హోల్డర్‌లకు PG స్కాలర్‌షిప్, SC, ST విద్యార్థులకు PG స్కాలర్‌షిప్ లు ఉన్నాయి. UGC ప్రవేశపెట్టిన 4 స్కాలర్‌షిప్‌ల నమోదు ప్రక్రియ ప్రారంభమయింది.

1. UGC PG ఇందిరా గాంధీ స్కాలర్‌షిప్..

బాలికలను ఉన్నత విద్యవైపు ప్రోత్సహించేందుకు యూజీసీ ఈ స్కాలర్​షిప్​ను ఆఫర్​ చేస్తుంది. ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా కళాశాలలో రెగ్యులర్, ఫుల్​ టైమ్ పీజీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, దూరవిద్య విధానంలో పీజీ కోర్సుల్లో చేరే వారికి ఈ స్కాలర్​షిప్​ వర్తించదు.

ITBP Recruitment 2022: అగ్నివీర్ రిక్రూట్‌మెంట్‌కు అర్హత లేదా..? అయితే ఈ పోస్టులు మీ కోసమే..


కుటుంబంలో ఒక ఆడపిల్ల ఉన్న వారికే ఈ స్కాలర్​షిప్​ వర్తిస్తుంది. ఏడాది మొత్తం 1,200 స్కాలర్​షిప్​లను అందజేస్తారు. అర్హులైన వారికి ఏటా రూ. 36,200 స్కాలర్​షిప్​ అందజేస్తారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 30 సంవత్సరాలు మించరాదు. దరఖాస్తుకు చివరితేదీ అక్టోబర్ 31.

2. యూనివర్సిటీ ర్యాంక్ హోల్డర్లకు UGC PG స్కాలర్‌షిప్..

అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో యూనివర్సిటీ టాపర్ గా నిలిచిన వారికి యూజీసీ ఈ స్కాలర్​షిప్​ను ఆఫర్​ చేస్తోంది. అయితే, ప్రొఫెషనల్, దూరవిద్య కోర్సులు చేసే వారికి ఈ స్కాలర్​షిప్​ వర్తించదు. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ, డీమ్డ్ యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీ, అటానమస్ కాలేజీలో రెగ్యులర్, ఫుల్ టైమ్ మాస్టర్స్ డిగ్రీ కోర్సులో అడ్మిషన్ పొందిన మొదటి, రెండవ ర్యాంక్ హోల్డర్లు మాత్రమే ఈ స్కాలర్‌షిప్​కు అర్హులు.

ఏటా సాధారణ కోర్సులు చేసే 1,800 మంది, ఆనర్స్ కోర్సులు చేసే 575 మందికి స్కాలర్​షిప్​ అందజేస్తారు. స్కాలర్‌షిప్ కింద రెండేళ్లపాటు నెలకు రూ. 3,100 అందజేస్తారు. అభ్యర్థుల వయస్సు అడ్మిషన్ సమయంలో 30 సంవత్సరాలలోపు ఉండాలి. దరఖాస్తుకు చివరితేదీ అక్టోబర్ 31.

3. SC, ST విద్యార్థులకు UGC PG స్కాలర్‌షిప్

ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను ఇంజనీరింగ్, టెక్నాలజీ, మేనేజ్‌మెంట్, ఫార్మసీ, ఇతర ప్రొఫెషనల్ వైపు ప్రోత్సహించేందుకు ఈ స్కాలర్​షిప్​ స్కీమ్​ను ప్రవేశపెట్టారు. దీని కింద ఏటా 1,000 మందికి స్కాలర్​షిప్​ అందజేస్తారు. ఎంఈ, ఎంటెక్ కోర్సులకు నెలకు రూ.7,800, ఇతర కోర్సులకు నెలకు రూ.4,500 స్కాలర్​షిప్​ మంజూరు చేస్తారు. దరఖాస్తుకు చివరితేదీ అక్టోబర్ 31. యూజీసీ గుర్తింపు పొందిన సంస్థల్లో ప్రొఫెషనల్ కోర్సులు అభ్యసిస్తున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు అర్హులు.

​​ICG Recruitment 2022: పది, ఇంటర్, డిగ్రీ అర్హతతో.. ఇండియన్ కోస్ట్ గార్డ్ లో ఉద్యోగాలు..


4. UGC ఇషాన్ ఉదయ్ స్కాలర్‌షిప్

భారతదేశంలోని ఈశాన్య ప్రాంతం (NER) విద్యార్థులను ఉన్నత విద్యలో ప్రోత్సహించేందుకు యూజీసీ ఈ స్కాలర్​షిప్​ను ఆఫర్​ చేస్తోంది. మొదటి సంవత్సరంలో ఉన్న అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు మాత్రమే స్కాలర్‌షిప్​కు అర్హులు. మెడికల్, పారామెడికల్ కోర్సులతో సహా సాధారణ డిగ్రీ కోర్సులు చేసే విద్యార్థులు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. 4.5 లక్షలకు మించకూడదు. ఏటా 10,000 మంది విద్యార్థులకు స్కాలర్​షిప్​ అందజేస్తారు. సాధారణ డిగ్రీ చేసే వారికి నెలకు రూ. 5,400, టెక్నికల్, మెడికల్, ప్రొఫెషనల్, పారామెడికల్ కోర్సులు చేసే వారికి నెలకు రూ.7,800 స్కాలర్​షిప్​ అందజేస్తారు. దరఖాస్తుకు చివరితేదీ అక్టోబర్ 31. పూర్తి వివరాలకు https://ner.ugc.ac.in/ ను సందర్శించండి.

First published:

Tags: CAREER, Career and Courses, Career opportunities, EDUCATION, JOBS, Jobs Exams, Scholarship, Scholarships

ఉత్తమ కథలు