హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

JRF 2022: పీజీ పూర్తి చేశారా.. అయితే రెండేళ్ల పాటు నెలకు రూ.31వేలు పొందే అవకాశం..

JRF 2022: పీజీ పూర్తి చేశారా.. అయితే రెండేళ్ల పాటు నెలకు రూ.31వేలు పొందే అవకాశం..

JRF 2022: పీజీ పూర్తి చేశారా.. అయితే రెండేళ్ల పాటు నెలకు రూ.31వేలు పొందే అవకాశం..

JRF 2022: పీజీ పూర్తి చేశారా.. అయితే రెండేళ్ల పాటు నెలకు రూ.31వేలు పొందే అవకాశం..

JRF 2022: జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కోసం దరఖాస్తు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్. కేంద్ర అటవీ మరియు పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా (BSI)లో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్(Junior Research Fellowship) కోసం దరఖాస్తు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్. కేంద్ర అటవీ మరియు పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా (BSI)లో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియాలో మొత్తం 33 JRF ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా www.bsijrfrecruitment.com అధికారిక రిక్రూట్‌మెంట్ వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు .

Indian Railway: పెరిగిన 500 రైళ్ల వేగం.. ప్యాసింజర్ నుంచి ఎక్స్‌ప్రెస్‌ గా.. ఎక్స్‌ప్రెస్‌ నుంచి సూపర్‌ఫాస్ట్‌ గా మారిన రైళ్లు..

దరఖాస్తు ఫీజు.. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే జనరల్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజుగా రూ.400 చెల్లించాల్సి ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులు రూ.200 దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు దరఖాస్తు రుసుము రూ.100 చెల్లిస్తే సరిపోతుంది.

Expensive Schools: ఆ పాఠశాలలో వార్షిక ఫీజు రూ. కోటిన్నర.. ఒక్క విద్యార్థికి 4 గురు ఉపాధ్యాయులు.. ఖరీదైన పాఠశాలలు ఇవే..

విద్యార్హతలు

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎమ్మెస్సీలో బోటనీలో డిగ్రీ కలిగి ఉండాలి. ఇందుకు కనీసం 55 శాతం మార్కులు సాధించాలి. ఏదైనా ప్లాంట్ గ్రూప్‌లో ప్లాంట్ టాక్సోమాలజీలో ఎంఎస్సీ డిగ్రీ ఉండాలి. దీనితోపాటు కంప్యూటర్‌పై పని చేసే పరిజ్ఞానం ఉండాలి. దీనితో పాటు.. మీరు మంచి విశ్లేషణాత్మక సామర్థ్యాన్ని కలిగి ఉండాలి.

BCCL Recruitment 2022: నిరుద్యోగులకు శుభవార్త.. కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలకు నోటిఫికేషన్..

ఫెలోషిప్ వివరాలు..

JRFకి ఎంపికైన తర్వాత, అభ్యర్థి రెండేళ్లపాటు నెలకు రూ. 31000 మరియు మూడవ సంవత్సరం నుండి నెలకు రూ. 35000 ఫెలోషిప్ పొందుతారు. ఇది కాకుండా నిబంధనల ప్రకారం ఇంటి అద్దె భత్యం కూడా అందుబాటులో ఉంటుంది. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ప్రారంభంలో రెండేళ్లపాటు ఉంటుంది. వర్క్ అసెస్‌మెంట్ తర్వాత మూడో సంవత్సరంలో సీనియర్ రీసెర్చ్ ఫెలోగా నియమించబడవచ్చు. సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పనితీరు ఆధారంగా రెండేళ్ల వరకు పొడిగించవచ్చు.

వయోపరిమితి..

JRF అభ్యర్థుల గరిష్ట వయస్సు 28 సంవత్సరాలు. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ, వికలాంగులు, మహిళా అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో ఐదేళ్ల సడలింపు ఉంటుంది. అయితే OBC నాన్ క్రీమీ లేయర్ అభ్యర్థులకు వయోపరిమితిలో 3 సంవత్సరాల సడలింపు ఉంటుంది.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Fellowship, JOBS

ఉత్తమ కథలు